ఓటిటి : “కేరళ స్టోరీ” డిజిటల్ రిలీజ్ కి షాక్.!

గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర వచ్చి భారీ హిట్ అయ్యిన కాంట్రవర్సియల్ చిత్రం “ది కాశ్మీర్ ఫైల్స్” చిత్రం కోసం అందరికీ తెలిసిందే. కాగా అది ప్రోపగాండ అయినా నిజంగా నిజం తీసినప్పటికీ సినిమాని అయితే బాక్సాఫీస్ పరంగా ఆడియెన్స్ ఆదరించారు. కాగా ఈ సినిమా తర్వాత మళ్ళీ ఇదే తరహాలో వచ్చిన మరో భారీ హిట్ సినిమానే “ది కేరళ స్టోరీ”.

కేరళలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ చిత్రం కూడా అనేక కాంట్రవర్సీల నడుమ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి 250 కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీనితో థియేటర్స్ లో సంచలన విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఇప్పుడు ఓటిటి రిలీజ్ విషయంలో మరో షాక్ తగిలింది.

కాగా ఈ చిత్రం ఇపుడు ఓటిటి రిలీజ్ కి ఎలాంటి స్ట్రీమింగ్ సంస్థ కూడా ముందుకు రావడం లేదట. ఈ చిత్రంలో సెన్సిటివ్ సీన్స్ అలాగే ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ అయితే ఆ స్పందన ఎలా ఉంటుందో అనే అంచనాతో అయితే ఈ సినిమా ఓటిటి హక్కులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట.

దీనితో తాము ఓ స్ట్రీమింగ్ పార్ట్నర్ కోసం చూస్తున్నామని మేకర్స్ చెప్తున్నారు. అయితే ఇండియన్ సినిమా దగ్గర ఓటిటి లో సెన్సిటివ్ కంటెంట్ తో వచ్చి కాంట్రవర్సీ ఎదుర్కోవడం ఆల్ మోస్ట్ అన్ని డిజిటల్ సంస్థలకి కొత్తేమి కాదు అలాంటిది ఈ సినిమా విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు అంటే ఈ చిత్రం కలిగించిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.