ది కేరళ స్టొరీపై కమల్ హసన్ సీరియస్ కామెంట్స్

కేరళలోని లవ్ జిహాద్ ఘటనల స్ఫూర్తితో ది కేఅల స్టొరీ అనే సినిమాని హిందీలో సుదీప్తో సేన్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆదాశర్మ, సిద్ది అద్నాని ఈ మూవీలో లీడ్ రోల్ లో నటించారు. పెద్దగా గుర్తింపు ఉన్న స్టార్ స్టార్ క్యాస్టింగ్ సినిమాలో లేకపోయిన కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకొని ఏకంగా 200 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఈ స్థాయిలో కలెక్షన్స్ రావడానికి కారణం ఈ మూవీలో ఉన్న కాన్సెప్ట్ అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి ది కేరళ స్టొరీపై ముస్లిం సంఘాల నుంచి వ్యతిరేకత వస్తోంది. అలాగే రిలీజ్ సమయంలో కూడా ముస్లిం, మైనారిటీ వర్గాల వారు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ది కేరళ స్టొరీ మూవీని బ్యాన్ చేయాలని రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు.

అయితే ఈ మూవీకి కేంద్రంలో బీజేపీ మద్దతు ఉండటంతో ఎన్ని ఆటంకాలు ఎదురైన సక్సెస్ ఫుల్ గా రిలీజ్ చేశారు. ఇక వివాదాల మూవీ కావడం హిందూ వర్గాలకి చెందిన వారు ఎక్కువగా ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపించరు; తరువాత హిందుత్వ భావజాలాన్ని బలంగా నమ్మే అందరూ కూడా విస్తృతంగా ప్రమోట్ చేశారు. ది కేరళ స్టొరీలో వాస్తవ అంశాలనే చూపించారని చాలా మంది నమ్మడం వలన మూవీకి అంత ఆదరణ వచ్చిందని చెప్పొచ్చు.

అయితే ఈ చిత్రాన్ని బీజేపీయేతర రాజకీయ పార్టీలు అన్ని కూడా వ్యతిరేకించాయి. ఇదిలా ఉంటే తాజాగా కమల్ హాసన్ కూడా ఈ చిత్రంపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. నాకు ప్రాపగాండా సినిమాలు అస్సలు నచ్చవు. సినిమా టైటిల్ క్రింద ఇది నిజమైన కథ అని వేసుకున్నంత మాత్రాన వాస్తవం అయిపోదు. కచ్చితంగా ది కేరళ స్టొరీ వాస్తవాలని వక్రీకరించి తీసిన మూవీగానే చూస్తాను అంటూ కామెంట్స్ చేశారు.

అయితే కమల్ హాసన్ కామెంట్స్ పై దర్శకుడు సుదీప్తో సేన్ రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. సినిమా చూడని వారు మాత్రమే ది కేరళ స్టొరీ మూవీపై తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. చూసిన తర్వాత వారందరూ వాస్తవం అర్ధం చేసుకున్నారు. కమల్ హాసన్ కూడా మూవీ చూడలేదని అనుకుంటున్నా అంటూ కామెంట్స్ చేశారు.