Shilpa Ravi: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు నెలకొన్న సంగతి మనకు తెలిసినదే.ముఖ్యంగా అల్లు అర్జున్ కొంతమంది రాజకీయ నాయకులు కూడా టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా విడుదలను అడ్డుకుంటాము అంటూ వార్నింగులు ఇచ్చారు.
ఇలా ఈ సినిమాకు రాజకీయ నాయకుల నుంచి అభ్యంతరాలు రావడానికి కారణం అల్లు అర్జున్ తన స్నేహితుడు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శిల్పా రవికి మద్దతు తెలుపుతున్న నంద్యాల వెళ్లడమే కారణమని తెలుస్తుంది. తన మామయ్య పవన్ కళ్యాణ్ కి కాకుండా వైకాపాకు మద్దతు తెలపడంతో జనసేన నాయకులు మెగా అభిమానులు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ ఆయన సినిమాను పూర్తిస్థాయిలో నెగిటివ్ ప్రచారం చేస్తూ వచ్చారు.
కంటెంట్ బాగుంటే ఎన్ని నెగిటివ్ వార్తలు వచ్చిన సినిమా విజయాన్ని అడ్డుకోలేరు అనే విధంగా బన్నీ ఈ సినిమా ద్వారా నిరూపించారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదల కావడంతో అల్లు అర్జున్ హైదరాబాదులో సంధ్య థియేటర్లో తన ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూశారు. అదే విధంగా మాజీ వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవి సైతం తన ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులకు ఈ సినిమాని చూశారు.
ఈ సినిమా చూసిన ఈయన సినిమా చాలా అద్భుతంగా ఉందని, ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని తెలిపారు.ఈ సినిమాలో నాకు జాతర సీన్ అద్భుతంగా నచ్చిందని, ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారని తెలిపారు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ కావడం ఖాయం అంటూ మాజీ ఎమ్మెల్యే చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.