మొదట “విరూపాక్ష” లో మెయిన్ విలన్ ఆమె అట.!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చినా సెన్సేషనల్ అండ్ క్లీన్ హిట్ చిత్రాల్లో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా యంగ్ దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కించిన చిత్రం “విరూపాక్ష” కూడా ఒకటి. ఓ ఇంట్రెస్టింగ్ మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా అయితే సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచి అదరగొట్టింది.

అయితే ఈ సినిమా విషయంలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా చాలా కీలక పాత్ర పోషించినట్టుగా మేకర్స్ కూడా తెలిపారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే బయటకి వచ్చింది. ఈ చిత్రంలో మెయిన్ విలన్ ఎవరు అనేది ఎంత ఆసక్తిగా ఎన్ని ట్విస్ట్ లు తర్వాత తెలుస్తుందో చూసాము.

క్లైమాక్స్ లో అయితే హీరోయిన్ సంయుక్త మీనన్ నే విలన్ అని తెలియడం ఓ క్రేజీ ట్విస్ట్ కాగా ఈ ట్విస్ట్ ని సుకుమార్ మార్చినట్టుగా కార్తీక్ తెలిపాడు. అయితే కార్తీక్ విలన్ గా ఎవరిని రాసుకున్నాడో తెలుసా? ఈ సినిమాలో చాలా ఇనోసెంట్ పాత్రలో కనిపించిన యాంకర్ శ్యామల అట.

ఆమెని తాను మెయిన్ విలన్ గా రాసుకోగా దానిని ఆమె నుంచి మరింత థ్రిల్లింగ్ గా ఉంటుంది అని సుకుమార్ హీరోయిన్ మీదకి మార్చరట. ఇలా విరూపాక్ష విలన్ విషయంలో బిగ్ ఛేంజ్ చోటు చేసుకుంది. ఇక ఈ సినిమాకి అయితే కాంతారా సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ వర్క్ చేయగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు నిర్మాణం వహించారు.