టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల లిస్టులో ప్రభాస్‌దే టాప్ ప్లేస్. తాజాగా శర్వానంద్ పెళ్ళి ఖాయమైపోయింది. దాంతో, ప్రభాస్ మీద మరింత ఒత్తిడి పెరుగుతోంది.
నిజానికి, అన్నీ అనుకున్నట్టు జరిగి వుంటే, కృష్ణంరాజు జీవించి వుండగానే ప్రభాస్ పెళ్ళి జరిగిపోయి వుండేది. త్వరలో పెళ్ళి చేసేస్తాం.. అంటూ ప్రభాస్ పెళ్ళి గురించి కృష్ణంరాజు ఒకింత సీరియస్‌గా కొన్ని నెలల క్రితమే చెప్పారు. ఇంతలోనే, కృష్ణంరాజు హఠాన్మరణం చెందారు.
ఇక, ఇప్పుడు ప్రభాస్ వీలైనంత త్వరగా పెళ్ళి చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో, ప్రభాస్ పెళ్ళి ప్రయత్నాల్లో బిజీ బిజీగా వున్నాడని అంటున్నారు. ఈ ఏడాది చివర్లో ప్రభాస్ పెళ్ళి పీటలెక్కే అవకాశం వుందని తెలుస్తోంది.
బంధువుల్లోనే అమ్మాయి కోసం వెతుకులాట మొదలైందని సమాచారం. కృష్ణంరాజే, ఓ సంబంధం చూసి పెట్టారనీ, అదే ఫైనల్ అవుతుందని కూడా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.