స్పీడ్‌ పెంచిన శర్వానంద్‌!

రెండేళ్లుగా సైలెంట్‌ గా ఉన్న యువ హీరో శర్వానంద్‌ సినిమాల వేగం పెంచారు. ఏకంగా నాలుగైదుచిత్రాలు లైన్‌లో పెట్టాడు. తాజాగా అదే కోవలో మరో కొత్త చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. చివరగా 2022లో ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో కనిపించిన ఆయన ఇప్పటివరకు మరే సినిమాలోనూ కనిపించలేదు.

ఈ చిత్రం తర్వాత పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడైన శర్వా తాజాగా తండ్రిగా ప్రమోషన్‌ కూడా పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘మనమే’ అనే చిత్రం షూటింగ్‌ లో శర్వా బిజీగా ఉండగా.. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన పాట మంచి వ్యూస్‌ దక్కించుకుంది.

తాజాగా తన జన్మదినం సందర్భంగా , 37 మరో రెండు చిత్రాలను ప్రకటించారు. ఇప్పుడు అదే కోవలో మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. గతంలో రానాతో ఘాజీ , వరుణ్‌ తేజ్‌తో అంతరిక్షం , విద్యుత్‌ జమ్వాల్‌ అనే బాలీవుడ్‌ చిత్రం రూపొందించిన యువ దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి తాజాగా చాలా గ్యాప్‌ తర్వాత మరో సినిమా రూపొందించడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.సంకల్ప్‌ చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్‌ ఓకే చెప్పాడని ..ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెకక్నున్నట్లు, ఈ యేడాది చివరలో సెట్స్‌ పైకి రానునన్నట్లు సోషల్‌ మీ డియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.