తల్లిదండ్రులు మంచి పొజిషన్ లో ఉంటే.. ఖచ్చితంగా పిల్లలు కూడా మంచి పొజిషన్ లోనే ఉంటారు. లేదా పిల్లలకు మంచి చదువు ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో అయితే.. స్టార్ హీరో లేదా స్టార్ హీరోయిన్ పిల్లలు కూడా స్టార్ హోదానే అనుభవిస్తారు. వాళ్లకు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లడం పెద్ద పనే కాదు. పాపులారిటీ కూడా అంతే ఉంటుంది. క్రేజ్ కూడా ఏ మాత్రం తగ్గదు. స్టార్స్ కు ఎంత క్రేజ్ ఉంటే.. వాళ్ల పిల్లలకు కూడా అంతే ఉంటుంది.
నిజం చెప్పాలంటే స్టార్స్ కంటే కూడా ఎక్కువ పాలోయింగ్ ఉంటుంది వాళ్ల పిల్లలకు. ఎందుకంటే.. వాళ్ల పిల్లల నుంచి తమ అభిమాన తారల గురించి ఎన్నో విషయాలు తెలుస్తాయి కాబట్టి. వాళ్లు సోషల్ మీడియాలో అడుగు పెడితే చాలు.. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు వచ్చి చేరుతుంటారు.
ఆ లిస్టులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ కూతురు సుహానా ఖాన్ కూడా ఉంది. తనకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో సుహానా ఖాన్.. తన ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తుంటుంది.
తనకు ఏవైనా నెగెటివ్ కామెంట్స్ వచ్చినా.. వాటిని దీటుగా ఎదుర్కొంటుంది సుహానా. ఇటీవల తను నల్లగా ఉందని.. హైట్ తక్కువుందని కొందరు తన ఫోటోలకు నెగెటివ్ కామెంట్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ కామెంట్లకు సుహానా బాగానే రియాక్ట్ అయింది. తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది. అంతే కాదు.. ఆ కామెంట్లకు బదులుగా… తన గ్లామర్ ఫోటోను పెట్టి అల్లాడించేసింది.
బ్లాక్ స్లీవ్ లెస్ టాప్ వేసి షార్ట్ తో దర్శనమిచ్చింది ఆ ఫోటోలో. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు.. వామ్మో.. నిన్ను తక్కువ అంచనా వేశాం.. కానీ.. నువ్వేం తక్కువ తినలేదు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.