“భారతీయుడు 2” పై శంకర్ అలా కమల్ ఇలా..కన్ఫ్యూజ్ అవ్వకండి..!

Indian 2 will resume after one year

ఈ ఏడాది సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ హిట్ అయ్యినటువంటి చిత్రాల్లో ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ రాజ్ ల నుంచి వచ్చిన చిత్రం “విక్రమ్” కాగా ఈ సినిమాతోనే కమల్ హాసన్ తన కెరీర్ లో భారీ స్థాయి సక్సెస్ ని అందుకొని మళ్ళీ ట్రాక్ లో పడ్డారు.

ఇక దీనితో తన నెక్స్ట్ సినిమాలపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ చిత్రాల్లో అప్పటికే షూటింగ్ ఆగిపోయి అంచనాలు తగ్గిపోయిన సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా “భారతీయుడు 2” కూడా రీస్టార్ట్ చెయ్యడంతో దీనిపై మంచి అంచనాలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి.

ఇక లేటెస్ట్ గా అయితే ఈ సినిమాపై ఈరోజు అర్ధ రాత్రి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అనౌన్సమెంట్ లు అందించారు. ఈ సినిమాని తమిళ్ లో అక్కడి సీఎం తనయుడు స్టాలిన్ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్స్ వారు రిలీజ్ చేయనుండగా కమల్ హాసన్ మరియు దర్శకుడు శంకర్ పెట్టిన పోస్ట్ లు కాస్త కన్ ఫ్యూజింగ్ గా మారాయి.

కమల్ హాసన్ ఏమో సెప్టెంబర్ నుంచి సినిమా షూటింగ్ ఉంటుంది అని తెలపగా శంకర్ మాత్రం ఈరోజు నుంచే షూటింగ్ మొదలు చేస్తున్నామని తెలిపారు. దీనితో కమ్యూనికేషన్ ఇలా ఉందేంటి అని అభిమానుకుంటున్నారు.

అయితే ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కమల్ హాసన్ లేని సీన్స్ తో షూటింగ్ ఈరోజే స్టార్ట్ అవుతుంది అలాగే కమల్ హాసన్ సెప్టెంబర్ నెల నుంచి సెట్స్ లో అడుగు పెట్టనున్నారు. ఇదే అసలు క్లారిటీ.