SRK+: OTT లోకి షారుఖ్ ఖాన్… సొంత ప్రొడక్షన్ ద్వారా కొడుకు అరంగేట్రం … !

SRK+: కరోనా కాలం పుణ్యమా అని ఓటీటీలకు మహర్దశ వచ్చిందనే చెప్పవచ్చు. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఓటీటీల్లో విడుదలైమంచి పేరును సంపాదించుకున్నాయి. తమిళ్, మలయాళ వంటి సినీ పరిశ్రమలు సైతం ఇప్పుడు చాలా సినిమాలను ott లలో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వీటి వల్ల థియేటర్ యజమానులు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చినా, అంతంత డబ్బులు పెట్టి టిక్కెట్ కొనలేని సామాన్య ప్రజలకు ఇవి వరంగా మారాయి.

ఐతే అలాంటి తరహాలోనే డైనమిక్ స్టార్ట్ హీరో షారుఖ్ ఖాన్ కూడా వెళ్తున్నారు. ఆయన ఇటీవల చేసిన ఓ ట్వీట్ పలు సందేహాలకు తావిస్తోంది. కుచ్ కుచ్ హోనే వాలా హై.. ఓటీటీ దునియా మే ( ఓటీటీ ప్రపంచంలో ఏదో జరగబోతోంది ) అంటూ షారుఖ్ ట్వీట్ తో పాటు బ్యాక్ డ్రాప్ లో SRK+ లోగో ఉండడంతో ఆయన సొంతంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ ని స్టార్ట్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మిగిలిన వివరాలేవీ బయటకు రాకపోయినా, పలువురు సెలబ్రిటీలు విషెస్ తెలియజేస్తున్నారు.

అంతే కాకుండా కింగ్ ఖాన్ తన సొంత ప్రొడక్షన్ ద్వారా అరంగేట్రం చేయించే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా ఈ రంగంలోకి ఎంటర్ అవుతున్నారని టాక్.

ఇకపోతే ఎంతో కాలం నుంచి షారుఖ్ ని మళ్ళీ వెండి తెరపై చూడాలన్న ప్రేక్షకుల ఆశ త్వరలోనే నెరవేరనున్నట్టు సమాచారం. చాలా గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో సినీ అభిమానులను అలరించడానికి షారుఖ్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇదే సమయంలో ఈ ఓటీటీకి సంబంధించిన వార్త బయటికి రావడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.