వైరల్ : “మళ్ళీ పెళ్లి” తో ట్విస్ట్ ఇచ్చిన సెన్సేషనల్ జంట.!

టాలీవుడ్ సీనియర్ వెర్సటైల్ నటుడు డాక్టర్ నరేష్ ఎన్నో సినిమాలూ కీలక పాత్రలు చేసారు. అయితే నటుడు గా ఎంతో ఉన్నతమైన పేరు ఉన్న అతను తన పర్సనల్ లైఫ్ కి వచ్చే సరికి మాత్రం అసలు ఊహించని ట్విస్ట్ లు ఉన్నాయని చెప్పాలి. తాను కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోగా రీసెంట్ గా అయితే నరేష్ ప్రముఖ నటి పవిత్ర లోకేష్ తో డేటింగ్ లో ఉండడం వారి బంధం పెళ్లి వరకు వెళ్లడం వంటివి చూసి సోషల్ మీడియాలో నెటిజన్స్ షాక్ అయ్యారు.

అయితే ఈ ఇద్దరు ఆ మధ్య ఓ వీడియో లో లిప్ లాక్ పెట్టుకొని కూడా కనిపించి తమని ఆశీర్వదించండి అంటూ వీడియో రిలీజ్ చేయడం అయితే సెన్సేషన్ గా మారింది. కాగా ఇప్పుడు వాటి అన్నిటికి మించి పెద్ద ట్విస్ట్ నే ఇచ్చారు అని చెప్పాలి.

ఇన్ని రోజులు తాము నిజమైన రిలేషన్ లో ఉన్నారు అనుకుంటే ఇప్పుడు ఇదంతా తాము సినిమా కోసం చేసినట్టుగా ఓ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పుడు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాకి “మళ్ళీ పెళ్లి” అని టైటిల్ ని ఫిక్స్ చేయగా దీనిని డర్టీ హరి, 7 డేస్ 7 నైట్స్ లాంటి అడల్ట్ డ్రామా లు తెరకెక్కించిన ఎం ఎస్ రాజు దర్శకత్వం వహిస్తూ ఉండడం విశేషం.

మరి ఈరోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేయగా ఇవి ఇప్పుడు వైరల్ గా మరి సరికొత్త ప్రశ్నలు తీసుకొస్తున్నాయి. మరి వీరు నిజం గా పెళ్లి చేసుకున్నారా లేదా ఇదంతా ఇన్ని రోజులు డ్రామానా అని కన్ఫ్యూజన్ గా మారింది. అయితే వీటికి సమాధానం తెలియాలి అంటే ఈ వేసవిలో రిలీజ్ అయ్యే సినిమా కోసం అంతా ఎదురు చూడాల్సిందే.