ఇండస్ట్రీ టాక్ : ఎన్టీఆర్ “దేవర” కి సెన్సేషనల్ ఓటిటి ఆఫర్.. 

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ హైప్ లో ఉన్న పలు భారీ చిత్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మాసివ్ పాన్ ఇండియా చిత్రం “దేవర” కూడా ఒకటి కాగా ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

మరి ఇలా ఓ కంప్లీట్ పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కిస్తుండగా కొరటాల అయితే ఆచార్య నుంచి తేరుకొని దానికి సమాధానంగా అయితే దేవర తో అందించనున్నారని గట్టి టాక్ సినీ వర్గాలు నుంచి వినిపిస్తుంది. కాగా ఈ భారీ సినిమా చాలా లేట్ గా స్టార్ట్ అయినప్పటికీ ఈ సినిమా షూట్ మాత్రం జెట్ స్పీడ్ లో కంప్లీట్ అవుతుంది.

దీనితో ఈ సినిమా విషయంలో ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉండగా ఇప్పుడు ఓ సెన్సేషనల్ బజ్ అయితే ఈ చిత్రంపై వినిపిస్తుంది. ఈ సినిమాకి అట ఓ రికార్డు ఓటిటి డీల్ లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఏకంగా 200 కోట్లకి పైగా ఆఫర్ తో వరల్డ్ లీడింగ్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు పాన్ వరల్డ్ భాషల్లో సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.

దీనితో అయితే దేవర కి సెన్సేషనల్ ఆఫర్ లాక్ అయ్యింది అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బాంబ్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మేకర్స్ వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.