సెన్సేషనల్ గాసిప్ : “వీరసింహ” కోసం “వీరమల్లు” రాబోతున్నాడహో..?

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలయ్య అలాగే మరో స్టార్ హీరో గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు రీసెంట్ గానే వీరసింహా రెడ్డి అనే సినిమా సెట్స్ లో కలిసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం సెట్స్ లో కలిసాక ఇద్దరి ఫోటో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారగా మెగా మరియు నందమూరి ఫ్యాన్స్ దీనితో ఆనందం వ్యక్తం చేసారు.

ఇక దీనితో అయితే బాలయ్య షో కోసం పవన్ ని నార్మల్ గా కలిసిన మీటింగ్ ఇది అని తెలిసింది. కానీ ఇప్పుడు మరో సెన్సేషనల్ గాసిప్ వీరిపై ఇప్పుడు వినిపిస్తుంది. ఇదేమిటంటే ఈ జనవరి 6న జరగబోతున్న వీరసింహా రెడ్డి గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకకి గాను వీరమల్లు పవన్ కూడా హాజరు కానున్నట్టుగా తెలుస్తుంది.

ఇది విశ్వసనీయ వర్గాల నుంచి లేటెస్ట్ గా వినిపిస్తున్న సాలిడ్ గాసిప్ ఇది. ఇక ఈ గ్రాండ్ వేడుక అయితే ఒంగోలు లో ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై అతి త్వరలోనే అఫీషియల్ అనౌన్సమెంట్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు అలాగే జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.