సెన్సేషనల్ బజ్..రామ్ చరణ్ తో బాలీవుడ్ నెంబర్ 1 దర్శకుడు చిత్రం?

ఇప్పుడు మన టాలీవుడ్ కి చెందిన ప్రముఖ్ బిగ్ స్టార్స్ అంతా కూడా ఓ రేంజ్ లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ గా దూసుకెళ్తున్నారు. కాగా ఈ హీరోస్ లో అయితే గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. మరి ఇప్పుడు రామ్ చరణ్ టాలీవుడ్ నెంబర్ 1 దర్శకుడు రాజమౌళితో సినిమా చేసేసాడు.

తమిళ సినిమా నెంబర్ 1 దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తున్నాడు. మరి ఇప్పుడు రానున్న రోజుల్లో బాలీవుడ్ నెంబర్ 1 దర్శకునితో కూడా సినిమా చేస్తాడు అని కొన్ని సెన్సేషనల్ రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. కాగా బాలీవుడ్ సినిమా దగ్గర ఇతర దర్శకుల్లా కాకుండా అందరినీ మెప్పించే కంటెంట్ తో కొట్టే దర్శకుడు..

రాజు హిరానీ తో అయితే రామ్ చరణ్ వర్క్ చేస్తాడు అని కొన్ని సెన్సేషనల్ రూమర్స్ ఊపందుకున్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా కన్ఫర్మ్ లేదు కానీ నిజం అయితే మాత్రం ఇండియన్ సినిమా నుంచి మరో బిగ్గెస్ట్ కొలాబరేషన్ ఇది అని చెప్పాలి.

రాజు హిరానీ తెరకెక్కించిన 3 ఇడియట్స్ కానీ పద్మావతి, పీకే చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర శాసించాయి. ఇలాంటి దర్శకుడు ఇప్పుడు గ్లోబల్ ఫేమ్ తెచ్చుకున్న రామ్ చరణ్ తో సినిమా అంటే అది పీక్స్ లో ఉంటుంది. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్ నిజంగా ఉందో లేదో అని చాలా మంది అధికారిక క్లారిటీ కోసం చూస్తున్నారు.