అన్నం పెట్టిన సంస్థని అల్లరి చేసిన నీచుడు వీడు అంటూ ఆర్పీపై మండిపడ్డ సీనియర్ ప్రొడ్యూసర్?

ప్రస్తుతం ఇండస్ట్రీలో జబర్దస్త్ గురించి కిరాక్ ఆర్పి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం నడుస్తోంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన కిర్రాక్ ఆర్పి నాలుగు సంవత్సరాలు క్రితం జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసాడు. అయితే ఇంతకాలం జబర్దస్త్ గురించి ఎక్కడ మాట్లాడని ఆర్పి సడన్ గా ఇప్పుడు జబర్దస్త్ గురించి శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. జబర్దస్త్ లో ఆర్టిస్టులను బానిసలుగా చూస్తున్నారని, శ్యాం ప్రసాద్ రెడ్డి మా అందరి టాలెంట్ వాడుకుని కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు అంటూ ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అయితే జబర్దస్త్ గురించి కిరాక్ పార్టీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇప్పటికే పలువురు జబర్దస్త్ కమెడియన్లు ఆర్పి ని తప్పుపడుతున్నారు. తాజాగా సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు కూడా ఈ విషయంపై స్పందించాడు. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న చిట్టిబాబు ఆర్పి చేసిన వ్యాఖ్యలలో నిజం లేదని, శ్యాం ప్రసాద్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తిని అలా కించపరుస్తూ మాట్లాడటం సరైన పద్దతి కాదని వెల్లడించాడు. ఈ క్రమంలో కిరాక్ ఆర్పీ ఒక విశ్వాసఘాతకుడు అంటూ ఫైర్ అయ్యారు . జబర్దస్త్ కి రాకముందు ఆర్పి అంటే ఎవరో కూడా తెలియదు. జబర్దస్త్ అనేది పేరు సంపాదించిన వాళ్లతో చేసింది కాదు.. పేరు లేని వాళ్లని తీసుకుని వచ్చి వాళ్లకి పేరొచ్చేట్టు చేసిన కార్యక్రమం అంటూ చెప్పుకొచాడు.

ఇప్పుడు కొంచం పేరు వచ్చేసరికి తలపొగరుతో మాట్లాడుతున్నావ్. అన్నం పెట్టిన సంస్థని అల్లరి పాలు చేసిన నీచుడు. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న శ్యాం ప్రసాద్ రెడ్డి ఎన్నో మంచి సినిమాలను నిర్మించాడు. అంతటి గొప్ప వ్యక్తి గురించి ఇప్పటివరకు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదు. కానీ తాడు బొంగరం లేని వీడు అలాంటి మనిషిని దూషిస్తున్నాడు అంటూ మండి పడ్డాడు. మల్లెమాల లాంటి గొప్ప సంస్థ ఇండస్ట్రీ లో ఇంకొకటి లేదు. వాళ్లు ఎంత కరెక్ట్‌గా అమౌంట్ ఇస్తారో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఎక్కడైనా తప్పు జరిగితే అది పెద్దలకు చెప్పాలి. అప్పుడు కరెక్ట్ చేస్తారు. అంతే కానీ ఇలా ఎవరి కోసమో నీఛపు మాటలు.. లుచ్చా మాటలు మాట్లాడకూడదు . ఎటువంటి గుర్తింపు లేని నీకు జబర్దస్త్ వల్లే మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో అంటూ ఆర్పీ మీద మండిపడ్డారు.