బిగ్ బాస్ సీజన్ 6 లో మాజీ జబర్థస్త్ ఆర్టిస్ట్.. షో మొత్తం రచ్చ రచ్చే?

బుల్లితెర మీద ప్రసారమైన అతి పెద్ద రియాలిటీ షో లలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. ఎన్నో ఏళ్లుగా ప్రసారం అవుతున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల బిగ్ బాస్ యంజమాన్యం ప్రేక్షకులకు గుడ్ న్యూస్ చెప్పింది. తొందర్లోనే సీజన్ 6 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 కి సంబందించిన ప్రోమో కూడా విడుదల చేశారు. మునుపటి సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా నాగర్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.

సెప్టెంబర్ 4 వ తేది నుండి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సీజన్ 6 లో పాల్గొని కంటెస్టెంట్ ల గురించి చర్చ మొదలయ్యింది. ఇప్పటికే సీజన్లో పాల్గొని కంటెస్టెంట్ల గురించి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల మరొక కంటెస్టెంట్ పేరు బయటికి వచ్చింది. అతనెవరో కాదు జబర్ధస్త్ ద్వారా గుర్తింపు పొంది ఆ షో మీదే సంచలన వ్యాఖ్యలు చేసిన జబర్ధస్త్ మాజీ కంటెస్టెంట్ కిర్రాక్ ఆర్పి. సాధారణంగా ప్రతి సీజన్ లో యాంకర్లు యూట్యూబర్స్ తో పాటు జబర్దస్త్ నుండి ఒక కంటెస్టెంట్ ని తప్పకుండా తీసుకుంటారు. అందువల్ల ఈ సీజన్ లో కిర్రాక్ ఆర్పి ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిర్రాక్ ఆర్పి జబర్దస్త్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముక్కుసూటిగా మాట్లాడే కిర్రాక్ బిగ్ బాస్ హౌస్ లో ఉండటం వల్ల ఆట ఎంతో రసవత్తరంగా ఉంటుందని భావించి బిగ్ బాస్ యాజమాన్యం వారు కిర్రాక్ ఆర్పి సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా ఈ బిగ్ బాస్ సీజన్ 6 లో మరొక జబర్దస్త్ ఆర్టిస్ట్ చలాకి చంటి కూడా కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల చంటి ని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ఈ విషయాన్ని పొరపాటున లీక్ చేశాడు.