సుధీర్‌ని పిలిచి ఛాన్స్ ఇస్తే… ఫేమస్ అయ్యాక నన్ను పట్టించుకోలేదు: ఏడు కొండలు

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో జబర్దస్త్ గురించి పెద్ద రచ్చ జరుగుతోంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో కిర్రాక్ ఆర్పి కూడా ఒకరు. అయితే నాలుగు సంవత్సరాల క్రితం కిర్రాక్ ఆర్పి తన వ్యక్తిగత కారణాల వల్ల జబర్దస్త్ నుండి బయటికి వచ్చాడు. అయితే ఇంతకాలం జబర్దస్త్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆర్పి ఇటీవల జబర్దస్త్ గురించి జబర్దస్త్ యాజమాన్యం గురించి చాలా విమర్శలు చేశాడు. జబర్దస్త్ లోని ఆర్టిస్టుల టాలెంట్ అంతా వాడుకొని శాంప్రసాద్ రెడ్డి కోట్ల రూపాయలు ఆదాయం పొందుతున్నాడని, అక్కడ పనిచేసేవారిని జబర్దస్త్ యాజమాన్యం వారు బానిసలు లాగా చూస్తారని, తినటానికి సరైన భోజనం కూడా పెట్టరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అయితే ఆర్పి చేసిన వ్యాఖ్యలపై హైపర్ ఆది, రాంప్రసాద్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఆర్పి చెప్పిన దానిలో నిజం లేదని.. అయితే తాను ఎందుకు అలా మాట్లాడాడో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై సీనియర్ జబర్దస్త్ ఆర్టిస్ట్ షేకింగ్ శేషు కూడా స్పందించి కిర్రాక్ ఆర్పి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కిర్రాక్ ఆర్పి ఒక నీచుడు, మూర్ఖుడు. అన్నం పెట్టిన సంస్థని ఇలా దూషించి మాట్లాడటం సరైనది కాదు అంటూ షేకింగ్ శేషు చెప్పుకొచ్చారు. అయితే ఈ వివాదం గురించి తాజాగా జబర్దస్త్ డైరెక్టర్ ఏడుకొండలు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో ఏడుకొండలు ఆర్పి మాట్లాడిన వాటిలో నిజం లేదని కావాలంటే నేను నిరూపిస్తాను అంటూ వివరించాడు.

అంతేకాకుండా శ్యాంప్రసాద్ రెడ్డి గురించి ఆర్పి చేసిన వ్యాఖ్యలను ఏడుకొండలు తీవ్రంగా ఖండించాడు. ఎన్నో సంవత్సరాలుగా ఇండస్ట్రీలో గొప్ప నిర్మాతగా పేరుపొందిన శ్యాంప్రసాద్ రెడ్డి గారిని కిర్రాక్ ఆర్పి దూషించటంపై ఏడుకొండలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ఇండస్ట్రీలోనే శ్యాం ప్రసాద్ రెడ్డి గారి లాగా పేమెంట్ ఇచ్చే నిర్మాత ఎవరూ లేరని ఆయన వెల్లడించాడు. ఇక సుధీర్ గురించి కూడా ఏడుకొండలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు సుధీర్ ని పిలిచి అవకాశం ఇస్తే ఆ కృతజ్ఞత కూడా లేకుండా ఇప్పుడు కనీసం నా ఫోన్ కూడా తీయడు అంటూ మండిపడ్డారు. లైవ్ లోనే ఏడుకొండలు సుధీర్ కి ఫోన్ చేసినా కూడా సుధీర్ ఫోన్ తీయలేదు. కొంచెం పేరు, ప్రఖ్యాతలు రాగానే మన ఎదుగుదలకు కారణమైన సంస్థని వదిలి వెళ్ళటం, ఆ సంస్థ మీద విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదు అంటూ ఏడుకొండలు వివరించారు.