Spirit: స్పిరిట్‌ హీరోయిన్‌గా ఆమె ఫిక్స్ అయినట్లే?

ప్రభాస్‌ కథానాయకుడిగా సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించనున్న స్పిరిట్ సినిమా త్వరలో పట్టాలెక్కనుందనే వార్తలతో పాటు, ఈ సినిమా హీరోయిన్ ఎంపికపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్‌ను ఇందులో నటించేందుకు సంప్రదించారట. మృణాల్ ఠాకూర్ పేరు మొదట చర్చలోకి వచ్చినా, ఇప్పుడు సమీకరణాలు మారినట్లు తెలుస్తోంది.

దీపికా ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌ సరసన కింగ్ సినిమాలో నటిస్తున్నారు. ఇదే సమయంలో స్పిరిట్ కోసం కూడా కాల్‌షీట్లు కేటాయించేందుకు సిద్ధమవుతున్నారట. గతంలో సందీప్ వంగా కల్కి ప్రాజెక్ట్ పర్యవేక్షణలో ఉండగానే దీపికాతో కథను షేర్ చేశాడట. కానీ ఆమె ప్రెగ్నెన్సీ కారణంగా ఆ సమయంలో హామీ ఇవ్వలేదట. అయితే సినిమా ఆలస్యం కావడం, దీపికాకు ప్రస్తుతం ఉన్న అవకాశాల సర్దుబాటుతో ఇక స్పిరిట్‌లో ఆమె పాల్గొనడానికి పెద్దగా అడ్డంకులే లేవని సమాచారం.

ఇక కథ విషయానికొస్తే, ఇందులో ప్రభాస్‌ ఓ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడని ఇప్పటికే టాక్ ఉంది. సందీప్‌ వంగా చిత్రాల్లో హీరోయిన్లకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఉండడం చూస్తే, దీపికా పాత్ర కూడా ఈ సినిమాలో ప్రధానంగా ఉండొచ్చని అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అర్జున్ రెడ్డిలో షాలిని పాండే, కబీర్ సింగ్లో కియారా అద్వానీ, అనిమల్లో రష్మికను చూపించిన వంగా, దీపికాను కూడా డిఫరెంట్ షేడ్స్‌తో అందించనున్నాడనే ఊహలు కలుగుతున్నాయి. ప్రస్తుతం స్పిరిట్ కోసం విదేశాల్లో లొకేషన్ వేట కొనసాగుతుండగా, క్యాస్టింగ్ పనులు వేగంగా నడుస్తున్నాయని సమాచారం. మరోవైపు ప్రభాస్ విదేశీ ట్రిప్ ముగిసిన తర్వాత ది రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, ప్రశాంత్ వర్మ చిత్రాల డేట్లపై క్లారిటీ రానుంది.

నంద్యాలలో పాకిస్తాన్ పై ప్రేమ || Muslim Come To Rescue Pakistan Flag || Nadyal Incident || TR