jr NTR: తారక్ కు అక్క పాత్రలో సీనియర్ బ్యూటీ!

jr NTR:  ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస అవకాశాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ ఎన్టీఆర్ కు అక్క పాత్రలో నటించనుంది.

ఇంతకీ ఆ సీనియర్ హీరోయిన్ ఎవరో కాదు.. ఒకప్పటి ‘మురారి’ బ్యూటీ సోనాలి బింద్రే. గతంలో ఈమె సినీ ఇండస్ట్రీకి దూరం కాగా మళ్లీ రీ ఎంట్రీ తో ఇండస్ట్రీకి అడుగుపెట్టనుంది. దీంతో కొరటాల ఈమెను ఈ సినిమాలో తారక్ కు అక్క పాత్రలో తీసుకుంటున్నట్లు తెలిసింది. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి.