బుల్లితెరపై శేఖర్ మాస్టర్ క్రేజ్ అందరికీ తెలిసిందే. కొరియోగ్రాఫర్‌గా స్టార్ హీరోలకు ఎన్నో కొత్త కొత్త స్టెప్పులను కంపోజ్ చేసే శేఖర్ మాస్టర్.. బుల్లితెరపై నవ్వులు పూయిస్తాడు. ఢీ, జబర్దస్త్, స్పెషల్ ఈవెంట్లలో శేఖర్ మాస్టర్ చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. రోజా, ప్రియమణి, వర్షిణి, రష్మీలతో శేఖర్ మాస్టర్ చేసే సందడికి అందరూ ఫిదా అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా రోజా, ప్రియమణిలతో చేసే డ్యాన్స్ పర్ఫామెన్స్ ఓ రేంజ్‌లో ఉంటుంది.
అలాంటి శేఖర్ మాస్టర్ గత కొన్ని రోజులుగా సైలెంట్‌గా ఉంటున్నాడు. ఢీ షోలో జడ్జ్‌గా రావడం లేదు. ఆయన ప్లేస్‌లో యానీ మాస్టర్ వస్తోంది. అయితే దీనికి కారణం ఉందట. శేఖర్ మాస్టర్‌కు కరోనా వచ్చిందట. గత నెలలోనే కరోనా రాగా కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నట్టు పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను ప్లాస్మాను కూడా దానం చేశానని తెలిపాడు.
నాకు గత నెలలోనే కరోనా వచ్చింది. కిమ్స్ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నెగెటివ్ వచ్చింది. ఎవరికో అవసరం ఉందని చెప్పడంతో ప్లాస్మాను దానం చేసేందుకు వచ్చాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ప్లాస్మాను దానం చేశాను. మీరు కూడా ప్లాస్మాను దానం చేయండి.. దాని వల్ల ఓ ఇద్దరి ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది. ప్లాస్మాను డొనేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చాడు.