మోనాల్‌ని ఏడిపించిన శేఖర్ మాస్టర్.. వీడియో వైరల్

Sekhar master shares Monal Video From Alludu Adhurs Set

బిగ్ బాస్ షోలో మోనాల్ నర్మదా నదిగా పేరు తెచ్చుకుంది. వచ్చిన మొదటి మూడు వారాల్లో మోనాల్ ఏడుపులను చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రతీ మాటకు ఏడుస్తూ జనాలను బెదరగొట్టేసింది. మొత్తానికి వారాలు గడుస్తూ డన్న కొద్దీ రాటుదేలుతూ వచ్చింది. చివరకు ఎలిమినేట్ అయ్యే క్షణంలో నవ్వుతూ వెళ్లేసింది. ఒకప్పుడు చీటిమాటికి ఏడ్చే మోనాల్.. ఎలిమినేషన్ సమయంలో హుందాగా, నవ్వుతూ వెళ్లడంతో చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

Sekhar master shares Monal Video From Alludu Adhurs Set

మొత్తానికి బయటకు వచ్చిన మెనాల్‌ను స్టార్ మా ఆదుకుంది. డ్యాన్స్ ప్లస్ షోకు జడ్జ్‌గా ఎంపిక చేసుకుంది. అలా బిగ్ బాస్ టీం ముందుగానే ఓ ఒప్పందం చేసుకున్నట్టుంది. ఏది ఏమైనా గానీ మోనాల్‌కు మాత్రం మళ్లీ ఓ మంచి అవకాశమే వచ్చింది. అది కాకుండా తాజాగా మరో బంఫర్ ఆఫర్ వచ్చింది. అల్లుడు అదుర్స్ సినిమాలోని ఐటెం సాంగ్‌ ఆఫర్ కూడా వచ్చింది. బెల్లంకొండ శ్రీనివాస్, సోనూ సూద్‌లతో కలిసి మోనాల్ స్టెప్పులు వేస్తోంది.

ఈ మేరకు రెండ్రోజుల క్రితం షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నాడు. అయితే సెట్‌లో శేఖర్ మాస్టర్ మోనాల్‌ను ఆట పట్టించాడు. మోనాల్ ఏడుస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. మొహాన్ని చూపించమని అడిగాడు. కానీ మోనాల్ మాత్రం చూపించేందుకు నిరాకరించింది. అయితే మోనాల్ ఎందుకు ఏడుస్తోందో అర్థం కాలేదు. అయితే అది ఏడుపా? ఆనంద భాష్పాలా? అన్నది కూడా తెలియడం లేదు.