రొమాన్స్‌లో రెచ్చిపోయాడు.. దీపిక, రష్మీలతో శేఖర్ మాస్టర్ రచ్చ

Sekhar master romnace with Rashmi and Deepika Pilli

శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ఎంత సందడి చేస్తాడో అందరికీ తెలిసింది. కొరియోగ్రఫర్‌గా వెండితెరపై స్టార్ హీరోలకు అదిరిపోయే స్టెప్పులను కంపోజ్ చేసే శేఖర్ మాస్టర్ బుల్లితెరపై మాత్రం రొమాంటిక్ హీరోలా రచ్చ చేస్తుంటాడు. ఢీ షో, జబర్దస్త్ షోలో స్పెషల్ పర్ఫామెన్స్, పండుగలకు వచ్చే స్పెషల్ ఈవెంట్‌లలో శేఖర్ మాస్టర్ చేసే రచ్చ అందరికీ తెలిసిందే. బుల్లితెరపై రొమాంటిక్ పర్ఫామెన్స్ చేయాలంటే అది శేఖర్ మాస్టర్ తరువాత ఎవ్వరైనా అనే స్థాయికి వచ్చాడు.

Sekhar master romnace with Rashmi and Deepika Pilli

రోజా, ప్రియమణి, పూర్ణ ఇలా అందరితోనూ శేఖర్ మాస్టర్ రచ్చ చేశాడు. మరీ ముఖ్యంగా రోజాతో అయితే ఎన్నో ఈవెంట్లలో స్పెషల్ పర్ఫామెన్స్‌లు ఇచ్చాడు. రాజశేఖరా అంటూ సాగే రొమాంటిక్ పాటకు రోజా, శేఖర్ మాస్టర్ వేసిన స్టెప్పులు ఆ మధ్య బాగానే వైరల్ అయ్యాయి. ఇక ఢీ షోలో శేఖర్ మాస్టర్ వేసే పంచ్‌లు,చెప్పే జడ్జ్‌మెంట్, స్టేజ్ మీదకు వచ్చి వేసే స్టెప్పులు తెగ వైరల్ అవుతుంటాయి. ఇక అలా వచ్చే వారం ఢీ షోలో శేఖర్ మాస్టర్ రెచ్చిపోయినట్టు కనిపిస్తోంది.

కంటెస్టెంట్లు చేసిన రొమాంటిక్ పర్ఫామెన్స్‌ను మించిపోయేలా శేఖర్ మాస్టర్ మరో పర్ఫామెన్స్ చేశాడు. అటు రష్మి ఇటు దీపిక పిల్లని పెట్టేసుకుని ఇక రెచ్చిపోయాడు. కురులు అలా మెలితిప్పడం, నడుములు పట్టుకోవడం, ఒళ్లో కూర్చోబెట్టుకోవడం.. ఇలా ఒకటేమిటీ ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసేశాడు. రష్మీ, దీపికలు కూడా శేఖర్ మాస్టర్‌కు బాగానే సహకరించారు. ఇది చూసిన హైపర్ ఆది అదిరిపోయే పంచ్ వేశాడు. మీరు పాట వేస్తూనే ఉంటే.. వచ్చే పండుగ వరకు ఆయన ఆపడంటూ పరువుదీసేశాడు.