విన్ని ఇరగ్గొట్టేశాడు.. శేఖర్ మాస్టర్ కొడుకా మజాకా?

శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ఎంతగా ఫేమస్ అయ్యాడో అందరికీ తెలిసిందే. వెండితెరపై హీరోలతో అదిరిపోయే మాస్ స్టెప్పులను వేయించాడు. ప్రతీహీరోకు ఒక్కొక్క యూనిక్ స్టెప్పులను వేయించాడు. మాస్ పాటలైనా రొమాంటిక్ సాంగ్స్ అయినా శేఖర్ మాస్టర్ దుమ్ములేపుతాడు. శేఖర్ మాస్టర్ డ్యాన్సుల్లో ఎంత గ్రేస్ ఉంటుందో అతని కుమారుడు విన్ని వేసే స్టెప్పుల్లోనూ అంతే స్టైల్ అండ్ గ్రేస్ ఉంటుంది. విన్నిలో డ్యాన్సింగ్ స్కిల్సే కాదు కామెడీ టైమింగ్ కూడా ఉంది. జబర్దస్త్ వేదికపై ఎన్నో స్కిట్లలో విన్ని తన సత్తా చాటాడు.

Sekhar Master About Vinny Performance In Kanaka Mahalakshmi Lucky Draw
Sekhar Master About Vinny Performance In Kanaka mahalakshmi lucky draw

పండుగలకు వచ్చే స్పెసల్ ఈవెంట్లలో విన్ని చూసే కామెడీ, డ్యాన్స్ పర్ఫామెన్స్ మరో లెవెల్‌లో ఉంటుంది. శేఖర్ మాస్టర్‌లా నటిస్తూ అందర్నీ నవ్విస్తాడు. డ్యాన్సుల్లో శేఖర్ మాస్టర్ వారసుడి అనిపించుకునేలా తాజాగా ఓ పర్ఫామెన్స్ చేశాడు. ఈటీవీలో దీపావళికి కనకమహాలక్ష్మీ లక్కీ డ్రా అనే ఈవెంట్‌ను చేస్తున్నారు. ఇందులో ఎంతో మంది సెలెబ్రిటీల స్పెషల్ పర్ఫామెన్స్‌లున్నాయి.

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, అతని పిల్లలు అద్భుతంగా పాటలు పాడారు. ఇక యోధ, జబర్దస్త్ నరేష్, శేఖర్ మాస్టర్ కొడుకు విన్ని దేశభక్తిని చాటేలా ఓ పర్ఫామెన్స్‌ను చేశాడు. విన్ని అల్లూరి సీతారామరాజుగా అదిరిపోయే పర్ఫామెన్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఆ పర్ఫామెన్స్ చూసి శేఖర్ మాస్టర్ కూడా ఎమోషనల్ అయినట్టు కనిపిస్తోంది. ఎంతైనా శేఖర్ మాస్టర్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నాడని విన్నిపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles