సుధీర్ ఫాలోయింగ్ వేరే లెవెల్.. శేఖర్ మాస్టర్ కామెంట్స్ వైరల్!!

Sekhar Master About Sudheer In Akka Evare Athgadu

సుడిగాలి సుధీర్ గురించి ఒక్క పదంలో చెప్పాలంటే ఆల్ రౌండర్ అనే ట్యాగ్ సరిపోతుంది. డ్యాన్సులు, ఎమోషన్స్, నవ్వించడం, ఏడిపించడం, మ్యాజిక్ చేయడం, సాహసాలు చేయడం ఇలా అన్నింటిలో సుధీర్ తనదైన ముద్ర వేసుకున్నాడు. అందుకే సుధీర్‌ను బుల్లితెరపై ఆల్ రౌండర్ అంటారు. ఒకప్పుడు జబర్దస్త్ వేదికపై ఆర్టిస్ట్‌ల ఎంట్రీ ఇచ్చిన సుధీర్.. ఆ షోకే ఆయువు పట్టులా మారాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోన్న సుధీర్ ఫాలోయింగ్ మామూలుగా లేదు.

ఒకప్పుడు సుధీర్‌ను ఎవరైనా ఏదైనా అంటే ఎవ్వరూ అంతగా పట్టించుకునేవారు కాదు. స్కిట్‌లో ఎంతగా కించపరిచినా, సెటైర్లు వేసినా కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యేవారు కాదు. కానీ గత కొన్నిరోజలుగా సుధీర్‌ను కించపరిచేలా ఎవరైనా కౌంటర్లు వేస్తే జీర్ణించుకోలేపోతున్నారు. వారిని సోషల్ మీడియాలో సుధీర్ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. వినాయక చవితి ఈవెంట్‌లో రాహుల్ సిప్లిగంజ్ అన్న మాటలకు, బాబా భాస్కర్ ఢీ షోలో వేసిన కౌంటర్లకు నెటిజన్లు అంతే స్థాయిలో మండిపడ్డారు.

Sekhar Master About Sudheer In Akka Evare Athgadu

తాజాగా సుధీర్ ‘అక్కా ఎవరే అతగాడు’ ఈవెంట్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ చేశాడు. వాట్టే బ్యూటీ అంటూ దుమ్ములేచిపోయే స్టెప్పులు వేశాడు. ఇక సుధీర్ పర్ఫామెన్స్‌పై శేఖర్ అదిరిపోయే కామెంట్లు చేశాడు. సుధీర్ డ్యాన్స్ కోసం బయట ఎంతో మంది ఎదురుచూస్తుంటారు అంటూ ఫాలోయింగ్ గురించి చెప్పాడు. సుధీర్ ఎప్పుడు డ్యాన్స్ చేసినా చూడాలనిపిస్తుంది అద్భుతంగా చేస్తాడంటూ సుధీర్‌ను ఆకాశానికెత్తేశాడు.

Sekhar Master About Sudheer In Akka Evare Athgadu