సినిమాల కోసం ప్రభాస్ ఎంత కష్టపడుతున్నాడో చూస్తే కడుపు తరుక్కుపోతుంది!

సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లు స్టార్ డమ్ ను దక్కించుకోవడానికి ఎంత కష్టపడతారో.. దానిని కాపాడుకునేందుకు కూడా అంతకు రెండింతలు కష్టపడుతూ ఉంటారు. ఇక హీరోల విషయానికి వస్తే హీరోలు సినిమాలు తీస్తే కోట్లకు కోట్ల పారితోషికాలు తీసుకుంటారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అందుకు వారు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అంతేకాకుండా యాక్షన్ సన్నివేశాల కోసం ఒళ్ళు హునం చేసుకోవాల్సి కూడా వస్తుంది. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా సలార్ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడని యూనిట్ సభ్యులు తెలిపారు.

దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 30 శాతం షూటింగ్ ముగించినట్లుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ పేర్కొన్నాడు. ఇటీవలే ఒక మేకింగ్ వీడియోను షేర్ చేసి మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు. నైట్ షూట్స్ తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను ప్రభాస్ చాలా కష్టపడుతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో చాలా యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు. ప్రభాస్ కూడా ఈ సలార్ సినిమా కోసం బరువు తగ్గుతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఇక ప్రభాస్ దాదాపుగా నెల రోజుల పాటు వర్కౌట్స్ చేసి బరువు తగ్గినట్లు యూనిట్ సభ్యులు తెలిపారట. ప్రభాస్ బరువు తగ్గడం కోసం చాలా కష్టపడ్డాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మొత్తానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను చాలా ఇబ్బంది పెడుతున్నాట్లు తెలుస్తోంది.