బాలీవుడ్ : ఒకే ఏడాది రెండో ఇండస్ట్రీ హిట్టు..!

గడిచిన కొన్నేళ్లలో ఇండియన్ సినిమా దగ్గర రూల్ చేసిన సినీ పరిశ్రమ ఏదన్నా ఉంది అంటే అది డెఫినెట్ గా మన టాలీవుడ్ సినిమానే అని చెప్పాలి. కాగా టాలీవుడ్ డామినేషన్ బాగా పెరిగిపోవడం మరో పక్క బాలీవుడ్ చిత్రాలు ఓ రేంజ్ లో అయితే డిజాస్టర్ లు అవుతూ వచ్చాయి.

దీనితో బాలీవుడ్ బాగా డీలా పడింది. సో అలా అక్కడ నుంచి డౌన్ అయ్యిన బాలీవుడ్ మళ్ళీ ఈ ఏడాది 2023 లో అయితే రైజ్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం పఠాన్ తో సెన్సేషన్ కం బ్యాక్ అందుకున్న బాలీవుడ్ అక్కడ నుంచి ఇక మళ్ళీ వెనక్కి తీసుకోలేదు.

కొన్ని రీమేక్ సినిమాలు మినహా మిగతా చాలా సినిమాలు హిట్స్ అయ్యాయి. దీనితో బాలీవుడ్ మళ్ళీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చింది. సరే ఇది బాగానే ఉన్నా పఠాన్ అప్పటివరకు హిందీలో ఇండస్ట్రీ హిట్ అయినటువంటి బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలవగా..

ఈ చిత్రం అనంతరం వచ్చిన మరో చిత్రం ఇపుడు పఠాన్ అంతు చూస్తుంది. ఆ సినిమానే హిందీలో ఎప్పుడో రెండు దశాబ్దాల కితం వచ్చిన చిత్రం గదర్ కి సీక్వెల్ “గదర్ 2”. మరి ఈ సినిమా భారీ రేంజ్ లో సక్సెస్ ని అందుకొని ఇంకా హిందీలో సూపర్ రన్ ని కొనసాగిస్తుంది.

దీనితో ఇది ఈ ఏడాదిలో మొదటి ఇండస్ట్రీ హిట్ అయ్యిన చిత్రం పఠాన్ ని క్రాస్ చేసిన సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా అయితే నిలిచింది అని బాలీవుడ్ వర్గాలు డిక్లేర్ చేసాయి. సో ఒకే ఏడాదిలో బాలీవుడ్ దగ్గర రెండు ఇండస్ట్రీ హిట్స్ నార్త్ లో పడ్డాయని చెప్పాలి. కాగా వరల్డ్ వైడ్ వసూళ్ళలో అయితే పఠాన్ ఇంకా లీడ్ లోనే ఉంది.