పెళ్లి కుదిరాక కాజల్ లో ఎంత మార్పు !

Kajal Agarwal
గ్లామర్‌ పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన కథానాయిక కాజల్‌ రాబోయే చిత్రాల్లో భిన్న పాత్రల్లో కనిపించనుంది. ఇందులో భాగంగా ‘మోసగాళ్ళు’ చిత్రంలో మంచు విష్ణుకి సోదరిగా నటించింది. అలాగే తమిళ సూపర్ స్టార్ విజయ్, మురుగదాస్ ‘తుపాకి 2’లో హీరోయిన్‌గా చేస్తోంది.
 
Kajal Agarwal
 
అయితే ఈ సినిమాలో కాజల్ చేసేది సెకెండ్ హీరోయిన్ క్యారెక్టర్ అట. అయితే, హీరోయిన్ కి ఉన్నంత ఇంపార్టెన్సు ఉంటుందని టాక్. వీటితోపాటు బాలీవుడ్‌లో ‘ముంబై సాగా’, కోలీవుడ్‌లో ‘ఇండియన్‌ 2’ చిత్రాల్లోనూ భిన్న పాత్రలు పోషిస్తోంది. అలాగే చిరంజీవి సరసన నటించబోయే ‘ఆచార్య’ చిత్రంలో కూడా కాజల్‌ పోషించే పాత్ర శక్తివంతంగా ఉండబోతోందని తెలుస్తోంది.
 
పాత్రలు, సినిమాల ఎంపికలో మార్పుకి కారణం ఏంటి? అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు కాజల్.. “నటిగా ఇకపై భిన్నంగా కనిపించాలను కుంటున్నా. అందుకే రొటీన్‌ పాత్రలకు చెక్‌ పెట్టేశా” అని కాజల్‌ సమాధానమిచ్చింది.