సర్కారు వారి పాట లేటవడానికి కరోనా సాకు మాత్రమే అసలు కారణం తెలిస్తే ఎంతమంది హర్ట్ అవుతారో ..?

సర్కారు వారి పాట .. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న లేటెస్ట్ సినిమా.వరుస హిట్ లతో మంచి ఫామ్ లో ఉన్నాడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. మంచి కథలను ఎన్నుకుంటూ…ట్రెండ్ కు తగ్గట్లు తన లుక్ ను మార్చుకుంటూ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నారు మహేష్. సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మాణ సారధ్యంలో పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట లో నటిస్తున్నారు మహేష్. ఈ మూవీలో మహేష్‌ తో జోడీ కట్టనుంది కీర్తి సురేష్. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా రిలీజ్ అయిన ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. అయితే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్న ఈ మూవీ ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు.

Sarkaru Vaari Paata mahesh babu Archives - MOVIE MAHAL TV

కరోనా కారణంగా ఇన్నాళ్లు షూటింగ్స్ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి…అయితే రీసెంట్ గా అన్ లాక్ ప్రక్రియ మొదలవడంతో…చిన్న సినిమాల నుంచి భారీ సినిమాల వరకు రీ షూట్ లు ప్రారంభించాయి. పవన్ నుంచి ప్రభాస్, జూనియర్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అగ్రతారలంతా తమ సినిమా షూటింగుల్లో బిజీ బిజీ గా ఉన్నారు. కానీ ఒక్క మహేష్ సర్కారు వారి పాట మాత్రం ఇంకా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఫారెన్ లో భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా అది సాధ్యపడలేదు…అయితే ఇప్పుడు షూటింగ్ ప్రారంభించాలనుకున్నా…మహేష్ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు సినిమా షూటింగ్ ఆగిపోవడానికి కరోనానే కారణమని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం తెలస్తే షాక్ అవ్వక తప్పదంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ మూవీ బ్యాంకు స్కాముల నేపథ్యంలో సాగుతుందట. ఇక్కడ అప్పు తీసుకుని విదేశాలకు పారిపోతున్న ఆర్థిక నేరగాళ్లను ఫోకస్ చేస్తూ…ఉంటుందని బయట టాక్. సో ఈ సినిమాకు సంబంధించి పక్కాగా స్క్రిప్ట్ రెడీగా ఉంటేనే సెట్స్ మీదకు తీసుకెళ్దామని మహేష్ చెబుతున్నారట. అందుకే షూటింగ్ కు ఇంత ఆలస్యమవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన షూటింగ్ విషయంలో మహేష్ లాస్ట్ లో ఉండిపోయారని అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఏదేమైన..మహేష్ లాంటి స్టార్ హీరో సినీరంగంలో రాణిస్తున్నారంటే దానికి పర్ఫెక్షనే కారణమని అభిమానుల మాట.