విజయ్ దేవరకొండతో డేట్ కి రెడీ అంటున్న బాలీవుడ్ భామ.. వీడియో వైరల్…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించిన విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా ద్వారా విజయ్ మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ రేంజ్ మారిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా గుర్తింపు పొందాడు. విజయ్ నటించిన టాక్సీవాలా, డియర్ కామ్రేడ్స్, నోటా వంటి సినిమాలు ప్లాప్ అయినా కూడా యువతలో విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు.

ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ నటించాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఆగస్టు 15వ తేదీన విడుదలకు కోసం సిద్ధంగా ఉంది. ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటు సౌత్ అటు నార్త్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా నుండి తాజాగా విడుదలైన ఒక పాట యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. పూరి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మీ కలసి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు.

లైగర్ సినిమా ద్వారా విజయ్ మొదటిసారిగా హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందే బాలీవుడ్లో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ స్టార్ హీరోల పిల్లలు సైతం విజయ్ కు అభిమానులుగా మారారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో కూతురు సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండతో డేటింగ్ చేయాలని ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ షో కి ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ రియాలిటీ షో కి ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు ఏడవ సీజన్ మొదలైంది. తాజాగా ఈ రియాలిటీ షోలో ప్రపంచ సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ సందడి చేశారు. తాజాగా ఈ రియాలిటీ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది. ఈ రియాలిటీ షోలో పాల్గొన్న వీరిద్దరూ తమ స్నేహం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలో మీరు ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు? అని సారా అలీఖాన్ ని కరణ్ అడగ్గా.. సారా స్పందిస్తూ విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. అయితే నేను నిన్ను విజయ్ దేవరకొండతో చూస్తున్నాను అంటూ కరణ్ జాన్వీని అడగ్గా.. నీకు కూడా విజయ్ నచ్చాడా ? అంటూ తిరిగి జాన్వీని ప్రశ్నించింది సారా. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.