‘ఆనిమల్’ సాంగ్.. “అర్జున్ రెడ్డి” హ్యాంగోవర్ నుంచి బయటకురా సందీప్.!

ఈ ఏడాది ఆల్రెడీ భారీ హిట్ లను బాలీవుడ్ సినిమా అందించిన సంగతి తెలిసిందే. దీనితో జస్ట్ ఈ ఒక్క ఏడాదిలోనే షారుఖ్ ఖాన్ అనే హీరోతో 2000 కోట్ల బాక్సాఫీస్ వసూళ్ళని బాలీవుడ్ టచ్ చేసింది. దీనితో ఇలా భారీ ఫామ్ లోకి వచ్చిన ఈ చిత్రం తర్వాత రానున్న మరిన్ని సినిమాలపై భారీ హైప్ నెలకొంది.

కాగా ఈ చిత్రాల్లో తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న “ఆనిమల్” అనే సినిమా కూడా ఒకటి. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంతో అయితే తాను అసలు వైలెంట్ అంటే ఏంటో చూపిస్తానని చెప్పాడు.

దీనితో ఆల్రెడీ వచ్చిన టీజర్ ప్రీ టీజర్ లు మంచి రెస్పాన్స్ ని అందుకోగా నెక్స్ట్ బాలీవుడ్ లో ఈ సినిమా భారీ హిట్ అవుతుంది అని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ చిత్రం విషయంలో మాత్రం ఇప్పుడు వచ్చిన ఫస్ట్ సాంగ్ తో అంతా మారింది. అసలు సందీప్ రెడ్డి వంగ ఫేమస్ అయ్యింది తన చిత్రం అర్జున్ రెడ్డి తో అయితే అందులో సేమ్ విజయ్ దేవరకొండ షాలిని పాండే లపై ఉండే సాంగ్ మధురమే తరహాలో ఇప్పుడు ఆనిమల్ నుంచి రిలీజ్ చేసింది కూడా కనిపిస్తుంది.

అసలు ఆ ముద్దులు హీరో యాటిట్యూడ్ భయం తల్లిదండ్రుల దగ్గర భయం లేని హీరోయిన్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అంతా కూడా అర్జున్ రెడ్డి లో చూసినట్టే అనిపిస్తుంది. దీనితో ఏదో ఆశించిన ఆడియెన్స్ కి తిప్పి తిప్పి మళ్ళీ అర్జున్ రెడ్డి నే చూపిస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆ సినిమా హ్యాంగోవర్ నుంచి బయటకి రావాలని కూడా సెటైర్స్ వేస్తున్నారు. 
ANIMAL (Telugu) Ammayi:Ranbir Kapoor,Rashmika M |Raghav,PritamAnantha | Sandeep Reddy V| Bhushan K