రోజులు ఇట్టే గడిచిపోయాయట.. భార్య మైకంలో పడ్డ సామ్రాట్

samrat Reddy about His First Month Wedding Celebration

బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ మొదటి పెళ్లి వ్యవహారం ఎంత రచ్చగా మారిందో అందరికీ తెలిసిందే. హర్షిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సామ్రాట్.. విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సామ్రాంట్ బిగ్ బాస్ సెకండ్ సీజన్ కంటెస్టెంట్‌గా లోపల ఉన్న సమయంలోనే ఈ విడాకుల వ్యవహారం రచ్చగా మారింది. తన ఇంట్లో దూరి దొంగతనం కూడా చేశాడని సామ్రాట్‌పై హర్షిత పోలీసు కేసు కూడా నమోదు చేసింది. అయితే చివరకు ఆ వివాహా బంధం విడాకులతో ముగిసిపోయింది.

samrat Reddy about His First Month Wedding Celebration
samrat Reddy about His First Month Wedding Celebration

మళ్లీ ఇన్నేళ్లకు సామ్రాట్ మరో అమ్మాయిని ప్రేమించి వివాహామాడాడు. గత నెల నాల్గో తేదీన రాజమండ్రిలో సామ్రాట్ శ్రీలిఖిత అనే అమ్మాయిని వివాహామాడాడు. నవంబర్ 4న రాత్రి జరిగిన ఈ వివాహా వేడుకలో బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి తనీష్, దీప్తి సునయన మాత్రమే హాజరయ్యారు. అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వివాహా వేడుకను సింపుల్‌గా జరిపించారు. అయితే అనంతరం సెలెబ్రిటీలకు, ఫ్రెండ్స్‌కు కలిసి ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చాడు.

అయితే సామ్రాట్ శ్రీలిఖితల వివాహాం జరిగి నేటికి ముప్పై రోజులు అవుతోంది. ఈ క్రమంలో మొదటి నెల యానివర్సీని సెలెబ్రేట్ చేసుకున్నారు. భార్య మైకంలో మునిగి తేలిన సామ్రాట్‌కు ఈ నెల రోజులు ఇట్టే గడిచిపోయాయట. ఇక ఎన్నో యేళ్లు ఇలాగే గడిచిపోవాలని కోరుకుంటున్నట్టు సామ్రాట్ అదిరిపోయే ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలో సామ్రాట్‌కు తన భార్య ఘాడంగా ముద్దు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.