నందుకి వార్నింగ్ ఇచ్చిన సరస్వతి…. ఇంటిని తాకట్టు పెట్టే ఆలోచనలో లాస్య నందు!

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే… తులసి హాస్పిటల్ పాలవడంతో కుటుంబ సభ్యులందరూ అక్కడికి వెళ్తారు. అయితేతులసి సోదరుడు దీపక్ లాస్యను బజారు మనిషి అనడంతో నందు తనపై చేయి చేసుకుంటారు. అదే సమయంలో సరస్వతి నందు గట్టిగా అరుస్తుంది మాజీ అల్లుడు అనే మర్యాద కూడా లేకుండా పేరు పెట్టి పిలుస్తున్నారా మీ కూతురికి కూడా ఇదే సంస్కారం నేర్పించారా అనీ లాస్య మాట్లాడుతుంది. నువ్వు నోరు ముయ్ అంటూ సరస్వతి లాస్యని కూడా అరుస్తుంది.

దీపక్ నునువ్వు కొట్టినప్పుడు వాడు కూడా తిరిగి నిన్ను కొట్టగలడు కానీ ఎందుకు ఊరికే ఉన్నాడు తెలుసా నువ్వు తన అక్క మాజీ మొగుడు అనే గౌరవంతోనే అలాగే ఉన్నాడు. దీనికంటే బుద్ధి లేదు తులసి వ్యక్తిత్వం ఎలాంటిదో 25 ఏళ్ల పాటు తనతో కలిసి కాపురం చేసి నీకైనా తెలియదా అంటూ నందుకి తనదైన స్టైల్ లో సరస్వతి వార్నింగ్ ఇవ్వడంతో నందు ఏమి మాట్లాడలేక తలదించుకుంటాడు.దీంతో సరస్వతి తులసి కళ్ళు తెరిచేలోగా మీరిద్దరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ వారికి చెప్పడంతో చేసేది ఏమీ లేక లాస్య నందు అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

వికలాసేనందుకు వెళ్లిపోవడంతో అనసూయ నందు మాట్లాడినందుకు నన్ను క్షమించండి అంటూ సరస్వతి కాలు పట్టుకోపోగా సరస్వతి మాత్రం మీరు క్షమాపణలు చెప్పడం ఏంటి అని అంటుంది.ఇక దేవుడు సామ్రాట్ తులసినీ ఎందుకు కలిపాడా అని నేను అనుకుంటున్నాను. నేను తులసికి జన్మనివ్వగా, సామ్రాట్ తనకు పునర్జన్మ ఇచ్చారు. మరోవైపు లాస్య నందు ఇంటికి వచ్చి చాలా సీరియస్ గా ఉంటారు నా వాళ్ళు నా చుట్టూ అంతమంది ఉన్న ఒక్కరు కూడా నాకు సపోర్ట్ గా మాట్లాడలేదు అని బాధపడతారు.

ఇక తులసికి స్పృహరావడంతో అందరూ కూడా వెళ్లి తెలిసిన చూస్తారు తులసి మాత్రం సామ్రాట్లేదని చూస్తూ ఉంటుంది. ఇక లాస్య నందుకు కాఫీ తీసుకురాగా వాళ్లంతా మనకు సపోర్ట్ చేయాలి అంటే నేను తులసి అని పేరు మార్చుకుంటాను అంటూ వెటకారంగా మాట్లాడుతూనే అలాగే బిజినెస్ గురించి మాట్లాడుతూ తన ఫ్రెండ్ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదని షాకింగ్ న్యూస్ నందుకు చెబుతుంది దీంతో నందు మరి ఇప్పుడు ఎలా అనడంతో నువ్వు ఏమి అనను అంటే ఈ ఇంటిని తాకట్టు పెట్టి బిజినెస్ కు పెట్టుబడి పెడదాం అని ఐడియా ఇస్తుంది. ఇంటిని తాకట్టు పెట్టాలి అంటే నందు ఆలోచిస్తూ ఉంటాడు.మరోవైపు హాస్పిటల్లో అందరూ తులసి తో కలిసి మాట్లాడుతూ ఉండగా సామ్రాట్ మాత్రం బయట నుంచి చూస్తూ మీరు ఇకపై ఇలాంటి మాటలు పడకూడదు అంటే నేను మీకు దూరంగా ఉండటమే మంచిదని ఎమోషనల్ అవుతూ ఉంటాడు.