సమీరా రెడ్డి ఒకప్పుడు టాలీవుడ్‌లో ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోయిన హీరోయిన్. ఎన్ని అవకాశాలు వచ్చినా, కావాల్సినంత అందం, కుర్రకారుకు మత్తెక్కించే హాట్ నెస్ ఉన్నా సరే ఈ అమ్మడుకి లక్ కలిసి రాలేదు. ఎన్టీఆర్, చిరంజీవి వంటి వారికి దారుణమైన ఫ్లాపులను ఇచ్చింది. అశోక్, నరసింహుడు, జై చిరంజీవ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సమీరా రెడ్డి పరిచయం. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం పెళ్లి చేసుకుని పిల్లలతో సరదాగా జీవితాన్ని గడిపేస్తోంది.
తాజాగా సమీరా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ డైరెక్టర్‌పై కామెంట్స్ చేసింది. ఓ అభ్యంతరకరమైన సీన్ చేయాల్సిందేనని పట్టు బట్టాడట. మొదట స్క్రిప్ట్ చెప్పినప్పుడు లిప్‌లాక్ గురించి ఏ మాత్రం చెప్పలేదట. కానీ సడన్‌గా ఒక సీన్ కోసం హీరోకు లిప్‌లాక్ ఇవ్వాల్సిందే అంటూ దర్శకుడు ఫోర్స్ చేశాడట. చేయనని చెబితే గొడవకు దిగాడట. ఎంత అభ్యంతరం చెప్పినా కూడా ఆ దర్శకుడు వినలేదు.
బెదిరించడానికి కూడా వెనుకాడలేదట. సినిమా నుంచి తప్పించడానికి కూడా సిద్ధమేనని వార్నింగ్ ఇచ్చాడట. అంతకుముందు చేసిన మూసాఫిర్ సినిమాలో లిప్ లాక్ ఇచ్చావ్ కాదా ఇందులో ఇవ్వడానికి అభ్యంతరం ఏంటని గదామాయించాడట. ఇక చివరకు ఆ కిస్ సీన్‌లో నటించేవరకు ఒప్పుకోలేదని సమీరా రెడ్డి వివరణ ఇచ్చింది. ఆ దర్శకుడు ఎవరు, ఆ సినిమా ఏంటి తదితర వివరాలేవీ సమీరా రెడ్డి చెప్పడానికి ఇష్టపడలేదు.