‘వదిన’ తెచ్చిన తంటా.! చీవాట్లు పడ్డాయట.!

‘వదినమ్మా’ అన్న పిలుపు కొన్నేళ్ళ క్రితం పెద్ద రచ్చకు కారణమైంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ – సమీరారెడ్డి కలిసి ‘అశోక్’,  ‘నరసింహుడు’ సినిమాల్లో నటించారు.. ఆ సమయంలో ఇద్దరి మధ్యా ఏదో నడిచిందన్న పుకార్లతో సమీరా రెడ్డిని వదినగా ఫిక్సయిపోయారు యంగ్ టైగర్ అభిమానులు.

ఆ తర్వాత కొన్నాళ్లకు తూచ్.! అదంతా వుత్తదే అని తేలిపోయిందనుకోండి. ఇప్పుడిలాంటి పరిస్థితే రష్మికా మండన్న ఎదుర్కొంటోంది. రష్మిక మండన్నని ‘వదినమ్మ’ అని ఫిక్సయిపోయినట్టున్నారు రౌడీస్.!

గత కొంతకాలంగా రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకీ, రష్మికకూ మధ్య ఏదో నడుస్తోందన్న పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ‘బేబీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రష్మిక గెస్ట్‌గా హాజరయ్యింది.

ఈ ఈవెంట్‌లో అభిమానులు ‘వదినమ్మా’ అంటూ రచ్చ చేశారు. అనూహ్యంగా జరిగిన ఈ సిట్యువేషన్‌కి రష్మిక కూడా షాక్ అయ్యింది. ఈ విషయమై అటు రష్మిక, ఇటు విజయ్ గుస్సా అయ్యారట. అలా అనొద్దంటూ అభిమాన సంఘాలకు విజయ్ క్లాస్ తీసుకున్నాడట.

ఒక్కసారి ఉవ్వెత్తున లేచిన ఈ ‘వదినమ్మ కెరటం’ అంత సులువుగా శాంతిస్తుందా.? అందులోనూ రష్మిక, విజయ్‌ల విషయంలో ఇంకాస్త కష్టమే. ఏమో శాంతిస్తే మాత్రం గొప్ప విషయమే.