జూనియర్ ఎన్టీఆర్ సమీరారెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన అశోక్, నరసింహుడు సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. అయితే ఎన్టీఆర్ సమీరారెడ్డి ఒకరినొకరు ప్రేమించుకున్నారని కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోలేదని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
సీనియర్ ఎన్టీఆర్ ఎన్నో విజయాలను సొంతం చేసుకోగా ఆ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. బాలయ్య ఇప్పటికీ వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ఈ జనరేషన్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఊహించని స్థాయిలో క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ అవుతాయని ఫ్యాన్స్ భావిస్తారు.
నందమూరి కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టే ఛాన్స్ వస్తే ఎవరైనా ఆ ఛాన్స్ ను వదులుకోవడానికి ఇష్టపడరనే సంగతి తెలిసిందే. వాస్తవం ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ సమీరారెడ్డి మంచి స్నేహితులు కాగా వాళ్లిద్దరి మధ్య అంతకు మించి మరేం లేదని సమాచారం. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని వీళ్లిద్దరూ ఎప్పుడూ అనుకోలేదని తెలుస్తోంది. వైరల్ అయిన రూమర్లను వీళ్లిద్దరూ పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.
తర్వాత కాలంలో జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతిని వివాహం చేసుకోగా సమీరా రెడ్డి అక్షయ్ వర్ధే అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సమీరా రెడ్డి సినిమా రంగానికి దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. సమీరా రెడ్డి మళ్లీ సినిమాలలో నటించి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.