బాలీవుడ్ లో ఖాన్ త్రయం లో ఒకడైన సల్మాన్ ఖాన్ కి అక్కడ ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపుని సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ కి ఈమధ్య సరి అయిన బ్లాక్ బస్టర్ దక్కలేదనే చెప్పాలి. ఆయన నటించిన ఆఖరి సినిమా టైగర్ 3. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ప్రముఖ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సికిందర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొక సౌత్ ఇండియన్ దర్శకుడు తో సల్మాన్ ఖాన్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో జవాన్ సినిమాతో తన స్టామినా ఏమిటో చూపించిన అట్లీ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ నటుడు కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ ఒక పిరియాడికల్ డ్రామాలో మునిపెన్నడూ చూడని పాత్రలో యోధుడిగా కనిపిస్తారని సన్నిహిత వర్గాల సమాచారం. ఈ సినిమా పునర్జన్మ డ్రామాగా తెరకెక్కబోతుందని గతం మరియు ప్రస్తుతం అనే రెండు విభిన్న కాలాలలో సెట్ చేయబడిందని తెలుస్తుంది.
ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తూ ఉండగా దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే యేడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కాబోతుంది ఈ సినిమా డ్యూయల్ హీరో సబ్జెక్ట్ అని కూడా తెలుస్తుంది. ఒక హీరోగా సల్మాన్ ఖాన్ నటిస్తుండగా మరొక హీరో ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ కి ఈ సినిమా కథ నచ్చటంతో సికిందర్ తర్వాత ఈ సినిమా నే స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం.
Exclusive video from the set of #Sikandar #SalmanKhan @BeingSalmanKhan @iamRashmika @MsKajalAggarwal
— 𝐁𝐄𝐈𝐍𝐆 𝐓𝐈𝐆𝐄𝐑…🐅!!! (@Only4Salman27) November 4, 2024