సలార్ : అరెస్టులతో వార్నింగ్ బెల్స్ ఇస్తున్న మేకర్స్..!

గడిచిన కొన్ని రోజుల్లో టాలీవుడ్ లో పలు చిత్రాలకి సంబంధించి పాటలు పోస్టర్ లు వీడియోలు కూడా లీక్ అయ్యిపోయిన సంగతి చూస్తున్నాము. అయితే ఇంట్రెస్టింగ్ గా ఇందులో పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమాలు కంటెంట్ అలాగే సంగీత దర్శకుడు థమన్ కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది. అయితే థమన్ సంగతి పక్కన పెడితే ప్రభాస్ నటించిన సినిమాల్లో బిగ్గెస్ట్ ఏక్షన్ చిత్రం సలార్ నుంచి కూడా చాలానే లీకులు వచ్చాయి.

దీనితో ఏకంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ మకాంని మార్చేసి అన్నీ పనులు చాలా సెక్యూర్ గా చేయడం స్టార్ట్ చేసాడు. ఇందుకే రిలీజ్ కూడా ఆలస్యం అయ్యింది అని ఓ టాక్ ఉంది. అయితే ఈ సినిమా లీక్స్ విషయంలో మేకర్స్ సైలెంట్ గా మాత్రం ఉండలేదు అట. తమ సినిమా కంటెంట్ విషయంలో అనుమతులు లేకుండా షేర్ చేసిన ఓ ఇద్దరిని అరెస్ట్ చేయించి కటకటాల పాలు చేశారట.

సో తమ కంటెంట్ విషయంలో ప్రమేయం లేకుండా ఎవరైనా తప్పుడు పనులు చేస్తే మాత్రం వారికి గట్టి శిక్షే తప్పేలా లేదని వార్నింగ్ ఇచ్చినట్టు అయ్యింది. మరి నెక్స్ట్ నుంచి అయినా ఏవన్నా లీక్ అయ్యినా వాటిని షేర్ చేసినా వారికి సైబర్ క్రైమ్ వారి నుంచి చిక్కులు తప్పవని చెప్పి తీరాలి మరి ఫ్యాన్స్ వీటిని దృష్టిలో పెట్టుకొని ఏమన్నా జాగ్రత్తగా ఉంటారో లేదో చూడాలి మరి. 
https://x.com/UrsVamsiShekar/status/1725503990140489804?s=20