డిసెంబర్‌ 22న సలార్‌ రిలీజ్‌ కాబోతుందని టాక్‌

ఇప్పుడొస్తుంది అప్పుడొస్తుంది అంటూ సలార్‌ రిలీజ్‌ డేట్‌ను ఊరిస్తున్నారు. చివరికి పోస్ట్‌ పోన్‌ అని చెప్పి అభిమానుల ఆశలపై నీళ్లు జల్లుతున్నారు. గతనెల రోజులగా ఇదే తతంగం జరుగుతుంది. నెల రోజుల ముందు వరకు కూడా సలార్‌ ఇదే నెల చివర్లో వస్తుందని క్లారిటీ ఇచ్చిన హోంబలే.. సడన్‌గా సైలెంట్‌ అయిపోయింది.

కొత్త పోస్టర్‌లు లేవు.. అప్‌డేట్‌లు లేవు. అంతలో సలార్‌ పోస్ట్‌ పోన్‌ అంటూ సోషల్‌ విూడియా మొత్తం ఊగిపోయింది. కానీ మేకర్స్‌ నుంచి ఎలాంటి జవాబు లేదు. ఇక రిలీజ్‌కు రెండు వారాల ముందు చావు కబురు చల్లగా అన్న రీతిలో సినిమా పోస్ట్‌ పోన్‌ అంటూ హోంబలో ఓ పెద్ద నోట్‌ను రిలీజ్‌ చేసింది. ఆ నోట్‌ను చూసిన అభిమానుల ఆగ్రహం అంతా ఇంతా కాదు. ఇక అదే టైమ్‌లో నవంబర్‌ రిలీజ్‌ అంటూ బుక్‌ మై షో అఫిషియల్‌గా ఆప్‌లో అప్‌డేట్‌ చేసింది.

సరేలే ఇన్ని రోజులు ఆగాము.. ఇంకా రెండు నెలలే కదా అని ఫ్యాన్స్‌ వాళ్లలో వాళ్లే సర్దిచెప్పుకున్నారు. కాగా ఇప్పుడు తాజాగా మరో డేట్‌ నెట్టింట వీర విహంగం చేస్తుంది. డిసెంబర్‌ 22న సలార్‌ రిలీజ్‌ కాబోతుందని డిస్ట్రిబ్యూటర్‌ల నుంచి టాక్‌ అని సమాచారం. దానికి తోడు ప్రశాంత్‌ నీల్‌ భార్య లిఖితా రెడ్డి కూడా ఈ ఏడాది డిసెంబర్‌ ఎప్పటిలా ఉండదూ అంటూ ఫైర్‌ సింబల్స్‌ను పెట్టింది. దాంతో డిసెంబర్‌లో సలార్‌ సినిమా పక్కా అని ఓ చిన్న క్లారిటీ వచ్చేసింది. అయితే తేదిలో మార్పులు మాత్రం ఉండొచ్చని టాక్‌. ఎందుకంటే అదే రోజున షారుఖ్‌ డుంకీ కూడా వస్తుంది.

ఇప్పటికే పఠాన్‌, జవాన్‌లతో వరుస ఇండస్ట్రీహిట్‌లు కొట్టిన షారుఖ్‌.. ఈ సారి డుంకీతో పక్కా హ్యాట్రిక్‌ ఇండస్ట్రీ హిట్‌ కొడతాడని బాలీవుడ్‌ జనాలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పైగా ఈ సినిమాను తెరకెక్కిస్తుంది ఇప్పటి వరకు ఫ్లాప్‌ అనే మాట ఎరుగని దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణీ. దాంతో ఈ సినిమాపై హిందీ ప్రేక్షకులతో పాటు దక్షిణాది సినీ ప్రియులు కూడా అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదే గనుకు జరిగితే సలార్‌కు పెద్ద దెబ్బ పడటం ఖాయం.

ఎందుకంటే టాక్‌ ఎలా ఉన్నా డుంకీకి ఫస్ట్‌ వీకెండ్‌ వద్దన్నా కలెక్షన్‌ల వరద పారుతుంది. దాంతో సలార్‌ ఓపెనింగ్స్‌పై గట్టి దెబ్బ పడుతుంది. అదీ కాకుండా నార్త్‌లో థియేటర్‌ల సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఒకే రోజును రెండు పెద్ద సినిమాలు పోటీకి రావడం కత్తి విూద సామే. మరి నిజంగానే సలార్‌ డిసెంబర్‌ 22న వస్తుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.