తెలుగులో మాత్రం దంచికొడుతున్న “సలార్”.. 

గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు నడుమ వచ్చిన పలు చిత్రాల్లో అయితే ప్యాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “సలార్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం పార్ట్ 1 గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా మాత్రం పాన్ ఇండియా రిలీజ్ కి న్యాయం చేయలేకపోయింది. కానీ ఒక్క తెలుగు వెర్షన్ లో మాత్రమే సినిమా భారీ వసూళ్లు రిజిస్టర్ చేస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. కాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలు సహా యూఎస్ మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది.

ఇంకా ఇదిలా ఉండగా ఈ సినిమా 11వ రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ రికార్డు అందుకున్నట్టుగా వినిపిస్తుంది. ఈ ఒక్క 11వ రోజులోనే ఈ సినిమా 4 కోట్లకి పైగా షేర్ ని కొల్లగొట్టి సింగిల్ డే లో ఒక ఆల్ టైం రికార్డు నెంబర్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ సినిమా మిగతా భాషల్లో ఏమో కానీ తెలుగులో మాత్రం చాలా బాగానే వెళుతుంది అని చెప్పవచ్చు. 

అయితే ఇదే ఊపు కంటిన్యూ అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో సలార్ లాభాల్లోకి వెళుతుంది. మరి చూడాలి సినిమా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుంది అనేది. ఇంకా ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ సుకుమారన్ జగపతిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.