లేటెస్ట్ : “బ్రో ది అవతార్” నుంచి సూపర్బ్ గా సాయి తేజ్ లుక్.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా మరో హీరోగా దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్న ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ చిత్రం “బ్రో ది అవతార్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా కొనసాగుతూ ఉండగా గత కొన్ని రోజులు కితం పవన్ పై రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ టీజర్ కి అయితే క్రేజీ రెస్పాన్స్ వచ్చింది.

కాగా ఈ సినిమా నుంచి ఇపుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ లుక్ అండ్ మోషన్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. అయితే ఆసక్తికరంగా పవన్ కంటే సాయి ధరమ్ తేజ్ లుక్ మంచి వైబ్రెంట్ గా కనిపిస్తుంది. కాకపోతే పవన్ పోస్టర్ లో పవన్ ని క్లారిటీ గా చూపించలేదు.

కానీ సాయి తేజ్ ని మాత్రం ఫుల్ వైట్ అండ్ వైట్ లో చాలా సూపర్ స్టైలిష్ గా అయితే సముద్రఖని ప్రెజెంట్ చేయడం విశేషం. ఇక ఈ సినిమాలో అయితే అయితే తేజ్ మార్కండేయుడు అలియాస్ మార్క్ గా పవన్ కి బ్రో గా కనిపిస్తాడని కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే ఈ ఫస్ట్ లుక్ మంచి ఫ్రెష్ అండ్ సాలిడ్ గా ఉందని చెప్పొచ్చు.

ఇక నెక్స్ట్ అయితే ఎలాంటి అప్డేట్స్ సినిమా నుంచి వస్తాయో చూడాలి. బహుశా నెక్స్ట్ ఇద్దరికీ కలిపి ఓ పోస్టర్ రావచ్చని చెప్పొచ్చు. కాగా ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.