లాజికల్ గా “బ్రో” పాలిటిక్స్ కూడా కరక్టేగా బ్రో.. 

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర మిక్స్డ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ ని సెట్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం “బ్రో”. గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిజంగా గాడ్ లానే మరోసారి నటించిన చిత్రం ఇది కాగా దర్శకుడు సముద్రఖని తెరకెక్కించగా సాయి ధరమ్ తేజ్ అయితే హీరోగా నటించగా కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది.

ఐతే ఈ సినిమా విషయంలో కంటెంట్ పక్కన పెడితే కొన్ని సీన్స్ ఐతే కామెడీ గా కొందరు ఏపీ పొలిటీషియన్స్ ని టార్గెట్ చేస్తూ పెట్టారని సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. అయితే తమని సినిమాలో టార్గెట్ చేశామని చెప్తున్నా ఆ కొందరికి ఓ క్లియర్ అండ్ లాజికల్ సమాధానం ఇప్పుడు బ్రో టీం నుంచి అయితే వినిపిస్తుంది.

టాలీవుడ్ ఓ సంచలనాల దర్శకుడు ఓపెన్ గానే పవన్ ని టార్గెట్ చేస్తూ అచ్చు గుద్దినట్టుగా పవన్ లా ఉన్నవారినే సినిమాలో పెట్టి అసలు అతడు పవన్ కాదని వేరే ఎవరినో చూపిస్తున్నాను మీకు అలా అనిపిస్తే అది మీ ప్రాబ్లమ్ నాది కాదు అని తేల్చి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే రీతిలో బ్రో టీం కూడా చెప్తున్నారు.

సినిమాలో జనసేన సంబంధించి టీ గ్లాస్ కానీ జనసేన స్టార్ లోగో కానీ అలాగే ఓ పొలిటీషియన్ ని ఇమిటేట్ చేస్తూ పెట్టిన సీన్స్ కానీ జనసేన సపోర్ట్ గానో లేదా ఎవరినో టార్గెట్ చేస్తూ పెట్టిందో కాదని ఒకవేళ అలా అనిపిస్తే అలా అనిపించిన వారి ప్రాబ్లమ్ అని అంటున్నారు. ఇదే సాయి ధరమ్ తేజ్ కూడా ఓ న్యూస్ ఛానెల్ కూడా కుండ బద్దలుకొట్టినట్టుగా తెలిపాడు. దీనితో లాజికల్ గా వీరు చెప్పింది కూడా కరెక్టేగా మరి.