పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో “బ్రో” సినిమా హవా..

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ చిత్రమే “బ్రో”. కాగా ఈ చిత్రంతోనే దర్శకుడు నటుడు సముద్రఖని టాలీవుడ్ లో పరిచయం కాగా తాను అయితే ఓ డీసెంట్ ఎంటర్టైనర్ ఇచ్చాడు కానీ ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది.

కాగా ఈ చిత్రం అయితే సినిమా థియేటర్స్ నుంచి ఓటిటి లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి రాగ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రం ఒక్క ఇండియా లోనే కాకుండా పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్ లాంటి పాశ్చాత్య దేశాల్లో కూడా రెస్పాన్స్ ని కుమ్మేస్తుందట.

కాగా ఈ చిత్రం ఊహించని విధంగా ఈ రెండు దేశాల్లో కూడా నెంబర్ 1 స్థానంలో బ్రో నిలిచి ట్రెండ్ అవుతుండగా వీటితో పాటుగా ఆఫ్రికా లాంటి దేశాల్లో కూడా ఈ చిత్రం ట్రేండింగ్ లో ఉందట. మరి బహుశా పవన్ అండ్ సాయితేజ సినిమాలకి ఇదే మొదటిసారి అని చెప్పాలి. మరి ఇది కొనసాగుతుందో లేదో చూడాలి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ అండ్ హాట్ బాంబ్ కేతిక శర్మ హీరోయిన్ గా నటించగా ప్రియా ప్రకాష్ వారియర్, పృథ్వీ రాజ్ తదితరులు నటించారు. అలాగే థమన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.