టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి పేరుకి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకుంది. తర్వాత తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సాయి పల్లవి రీసెంట్ గా బాలీవుడ్ సినిమాలో కూడా కమిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంతమంది ఫ్యాన్స్ అభిమానాన్ని సొంతం చేసుకున్న సాయి పల్లవి ఎందుకో ఎప్పుడూ ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది. ఆమె ప్రతి సినిమా విడుదలకు ముందు గతంలో ఆమె మాట్లాడిన మాటలను మళ్లీ షేర్ చేస్తూ విమర్శిస్తూ ఉంటారు కొంతమంది ప్రేక్షకులు.
అయితే ఇప్పుడు తాజాగా మరొక ట్రోల్ కి గురవుతున్న సాయి పల్లవి ఆ ట్రోలింగ్ కి సంబంధించిన క్లారిటీ ఇచ్చింది. కొన్నేళ్ల క్రితం తనను మలయాళీ అని పిలిచినందుకు ఒక రిపోర్టర్ పై ఆమె సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ మాటల్లో నిజం లేదని, ఆ వార్త నన్ను ఎంతగానో బాధించిందని కేరళ నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, ఆదరణ చాలా పెద్దదని చెప్పింది. ప్రేమమ్ సినిమా నన్ను ఈ రోజు మీరు చూస్తున్న వ్యక్తిగా మార్చిందని చెప్పింది.
ఈమధ్య గలాటా ప్లస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఆరోజు ఏం జరిగిందో, మీడియా వాళ్లతో తాను ఏం మాట్లాడింది అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. మూడు నాలుగేళ్ల క్రితం నేను మీడియాతో మాట్లాడుతున్నాను అప్పుడు ప్రెస్ మీట్ లేదు ఇంకా కెమెరాలు ఆన్ చేయలేదు, మలయాళీ నటీనటులందరూ ఇంత బాగా తెలుగు ఎలా మాట్లాడుతారని ఒక విలేకరి నన్ను అడిగాడు, అయితే నేను మలయాళీ కాదని తమిళనాడు నుంచి వచ్చానని చెప్పాను. ఆ విషయం అక్కడే ముగిసిపోయింది.
కానీ రెండేళ్ల తర్వాత నేను మలయాళీ అన్నందుకు రిపోర్టర్ పై మండిపడ్డాను అనే వార్త ఒకటి పేపర్లో రావటం చూసి నాకు చాలా బాధనిపించింది, అలాగే ఒక రోజు ఎయిర్పోర్టులో ఒక మహిళ నా దగ్గరికి వచ్చి మలయాళంలో మాట్లాడింది తర్వాత సడన్గా మాట్లాడటం ఆపేసి మీకు మలయాళం లో మాట్లాడితే నచ్చదు కదా అని సారీ చెప్పింది. ఆ మాటలకి మరింత బాధపడ్డాను అని చెప్పుకొచ్చింది సాయి పల్లవి ఇప్పటికైనా తన మాటల వెనుక ఉన్న అర్ధాన్ని ఆమెని విమర్శించేవారు ఆమె మాటల వెనుక ఉన్న అర్ధాన్ని అర్థం చేసుకుంటారని ఆశిద్దాం.