Sai Pallavi : కూలీ గా మారిన ఫిదా బ్యూటీ…సినిమా కోసం అనుకుంటే పప్పులో కాలేసినట్టే…!

Sai Pallavi : ఇప్పుడున్న హీరోయిన్లకు భిన్నంగా కేవలం అభినయంతో పేరు సంపాదించుకుని తన డాన్సు తో ఆకట్టుకుని టాప్ హీరోయిన్ అయిన ముద్దుగుమ్మా ఎవరంటే సాయి పల్లవి అనీ చెప్పక తప్పదు. ఫిదా సినిమాతో తెలంగాణ అమ్మాయే అనేలా తన యాస నటనతో ఆకట్టుకున్న పల్లవి తరువాత వచ్చిన ఏంసిఏ, నాగచైతన్య తో తీసిన లవ్ స్టోరీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ తెచ్చుకున్నాయి.

ఇక ఇటీవలే నానితో కలిసి శ్యామ్ సింగ్ రాయ్ లో నటించింది. ఈ సినిమా మిశ్రమ స్పందనతో ఓ మోస్తారు విజయాన్ని నమోదు చేసుకున్నా సాయి పల్లవి దేవదాసి పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ప్రస్తుతం సాయి పల్లవి రణ తో కలిసి విరాట పర్వం సినిమాలో నటిస్తున్నారు.ఇక ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ బ్రేక్ సమయాన్ని పొలం పనుల కోసం వినియోగించుకుంది. బ్రేక్ అంటే సినిమా షూటింగ్ మధ్యలో బ్రేక్ కాదు పండగ కోసం బ్రేక్ తీసుకుంది సాయిపల్లవి. ఈ భామ వ్యవసాయ పనులు చేస్తున్న కూలీల దగ్గరకు వెళ్లింది.

పసుపు పంట తీత పనులు చేస్తున్న అమ్మలక్కళ్లాగే సాయిపల్లవి ఎండ నుంచి కాపాడుకోవడానికి తలకు తువాలు చుట్టుకుంది. చేతిలో తట్ట పట్టుకుని దుక్కిని తవ్వుతూ పసుపు కొమ్ముల ను ఏరి కుప్ప చేసింది. పనంతా అయిపోయిన తర్వాత కూలీలందరితో కలిసి దుక్కిలోనే కూర్చొని ఫొటోలు దిగింది. ఈ ఫోటోలు ను నెట్టింట్లో పోస్ట్ చేయగా ట్రెండింగ్ అవుతున్నాయి.