ఈసారి కఠినంగా స్పందించిన సాయి పల్లవి.. ఏం జరిగిందంటే..

సినీ నటి సాయిపల్లవి ఇటీవల తనపై వస్తున్న పుకార్లపై కఠినంగా స్పందించారు. తమ వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు ప్రచురించడం అన్యాయమని, ఆ స్థాయిని దాటితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు.

సాయిపల్లవి తన వ్యాఖ్యల్లో, “పుకార్లు నిజమని అనుకోవడం వల్ల అసత్యాలు మరింత ప్రోత్సహింపబడతాయి. ఇకపై నిష్క్రమణ లేదు. నాపై అసత్య ప్రచారం చేయడం ఆపకుంటే చట్టపరమైన పరిష్కారాన్ని అనుసరిస్తాను,” అని పేర్కొన్నారు. ఇటీవల కొన్ని మీడియా వర్గాలు ఆమె వ్యక్తిగత జీవన శైలిని ఉద్దేశిస్తూ అర్థం లేని కథనాలు ప్రచురించడం ఆమెను ఆగ్రహానికి గురిచేసింది.

ఇప్పుడిదే పుకార్లలో ఒకటి బాలీవుడ్ మూవీ ‘రామాయణ’లో ఆమె సీత పాత్ర కోసం కొన్ని అలవాట్లు మార్చుకుంటున్నారని తప్పుడు సమాచారం ఇచ్చారు. అలాగే నాన్ వెజ్ కు దూరంగా ఉంటుందని కూడా కథనాల్లో హైలెట్ చేశారు. ఇక సాయిపల్లవి, తన సినిమాలే తమ కథనంగా ఉండాలని, వ్యక్తిగత జీవితం పై ఫేక్ న్యూస్ లు రాయడం అసమంజసమని అభిప్రాయపడ్డారు. కెరీర్‌లో శ్రమతో సాధించిన విజయాలను గౌరవించాలని ఆమె వివరణ ఇచ్చారు.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాయిపల్లవి అభిమానులు ఆమె రియాక్షన్ ను అభినందిస్తున్నారు. ఆమె ఈ ఘాటైన హెచ్చరికతో అసత్య ప్రచారాలను నిలువరించగలిగితే, సినీ పరిశ్రమలో ఇతర నటీమణులకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని అనుకుంటున్నారు.