స్పైసీ వెబ్ సిరీస్‌కి ఓకే చెప్పేసిన సాయి పల్లవి.!

వెబ్ సిరీస్ అంటే, దానికి కాస్తంత మసాలా వుండాలి. షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్ అంటాం కదా.. అలాగన్నమాట. అలాగని అన్ని వెబ్ సిరీస్‌లూ అలాగే వుంటాయని అనలేం. కానీ, కొన్ని వెబ్ సిరీస్‌లకు మాత్రం ఆ స్పైసీ టచ్ తప్పనిసరి. హోమో సెక్సువల్స్ కాన్సెప్ట్స్ ఈ వెబ్ సిరీస్‌లలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాంటి ఓ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌కి విలక్షణ నటి సాయి పల్లవి ఓకే చెప్పిందట.

అదేంటీ, సాయి పల్లవి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా వుంటుంది కదా.? అంటే, ఇప్పుడూ జాగ్రత్తగానే వుందామె. అన్నీ ఆలోచించే సాయి పల్లవి ముందడుగు వేసిందని అంటున్నారు.

అయితే, సాయి పల్లవి ఈ వెబ్ సిరీస్‌లో ఎలా కనిపించనుంది.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతోందిట. ఫుల్ డిటెయిల్స్ అతి త్వరలో వెల్లడి కానున్నాయని సమాచారమ్. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దీన్ని తెరకెక్కించబోతోంది.