ఏడవ తరగతిలోనే ప్రేమ లేఖలు వచ్చాయి.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్?

నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం వరుస తెలుగు తమిళ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. గ్లామర్ కు ఏ మాత్రం తావు లేకుండా ఎంతో అద్భుతమైన పాత్రలను ఎంపిక చేసుకుని వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నారు. విరాట పర్వం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది త్వరలోనే ఈమె నటించిన మరో చిత్రం గార్గి కూడా విడుదలకు సిద్ధమవుతోంది.ఇకపోతే సాయి పల్లవి ఏ విషయం అయినా కుండలు బద్దలు కొట్టినట్టు మాట్లాడే వ్యక్తిత్వం కలది. ఈ క్రమంలోనే ఈమె నెట్‌ఫ్లిక్స్ ప్రసిద్ధ చాట్ షో మై విలేజ్ షోలో పాల్గొంది. ఆమెతోపాటు హీరో రానా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సాయిపల్లవి మాట్లాడుతూ తన చిన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ తాను ఏడవ తరగతి చదివే సమయంలో తనకు ఒక అబ్బాయి లవ్ లెటర్ రాసి తనకు తెలియకుండా నా స్కూల్ బ్యాగ్ లో పెట్టాడు. అయితే ఆ విషయం నాకు తెలియక ఇంటికి వెళ్లి పోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నా తల్లిదండ్రులకు ఆ ప్రేమలేఖ దొరికింది.

ఈ విధంగా నా స్కూల్ బ్యాగ్ లో ప్రేమలేఖ దొరకడంతో నా తల్లిదండ్రులు నన్ను చితకొట్టారు అంటూ సాయి పల్లవి ఈ సందర్భంగా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను అందరితో పంచుకున్నారు. ఈ క్రమంలోనే సాయి పల్లవి చేస్తున్న ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రానా సరసన ఈమె నటించిన విరాటపర్వం సినిమా జూన్ 17న థియేటర్లలో విడుదలయ్యి పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయింది. ఈ క్రమంలోనే జులై 1న ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఈమేరకు సాయి పల్లవి తన సినిమా OTT ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.