సాయి పల్లవి గుస్సా అవుతోందిట.! కారణమేంటో.!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీలో సాయి పల్లవి నటించాల్సి వుంది. అయితే, డబ్బింగ్ సినిమా అన్న కారణంగా సాయి పల్లవి ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది. కీర్తి సురేష్ ఆ మెగా ఛాన్స్ పట్టేసింది.

అయితే, ఇప్పుడు ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నందుకు సాయి పల్లవి తెగ ఫీలయిపోతోందట. చిరంజీవితో కలసి డాన్స్ చేసే అదృష్టం మిస్ చేసుకుంది సాయి పల్లవి. సాయి పల్లవితో కలిసి డాన్స్ చేయాలని వుందని ఓ ఈవెంట్‌లో చిరంజీవి చెప్పారు. ‘భోళా శంకర్’ ఛాన్స్ దక్కించుకుంటే, ఆ అవకాశం రానే వచ్చేది. కానీ, సాయి పల్లవి మిస్ చేసుకుంది.

అయితే, స్పెషల్ సాంగ్‌లో అయినా మెగాస్టార్ ఛాన్స్ ఇస్తాడా.? అంటే ఏమో కానీ, ఎలాగైనా ఆ ఛాన్స్ దక్కించుకునే దిశగా సాయి పల్లవి ప్రయత్నాలు చేస్తోందట. ఆ ప్రయత్నంలో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని సాయి పల్లవి అప్రోచ్ అయ్యిందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ఇంతవరకు కెరీర్‌లో ఇలా ఎవర్నీ తనంతట తాను అప్రోచ్ అవలేదట సాయి పల్లవి.