‘విరూపాక్ష’ సినిమా విషయంలో హీరోయిన్ సంయుక్తకి ఒళ్ళు మండిపోయింది. ఉగాది సందర్భంగా తనను ప్రత్యేకంగా పరిచయం చేయలేదంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది చిత్ర నిర్మాణ సంస్థ మీద.
కేవలం సాయి ధరమ్ తేజ్ ఫొటోతో కూడిన ‘విరూపాక్ష’ పోస్టర్ విడుదల చేసి ఊరుకున్నారు. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేసింది సంయుక్త. దాంతో, హీరో సాయి ధరమ్ తేజ్ రంగంలోకి దిగాడు. చిత్ర నిర్మాణ సంస్థతో చర్చించాడు. ఎందుకీ నిర్లక్ష్యం.? అంటూ నిలదీశాడట. మొత్తానికి వివాదం దాదాపుగా సమసిపోయినట్లే. ‘లక్కీ ఛార్మ్‌ని ఎలా మర్చిపోతాం.?’ అంటూ సోషల్ మీడియా వేదికగా సంయుక్తని కూల్ చేసేందుకు ప్రయత్నించాడు.
‘ఓకే సూర్య (సినిమాలోని హీరో పాత్ర పేరు) అంటూ సాయి ధరమ్ తేజ్‌ని ఉద్దేశించి పేర్కొంది సంయుక్త. వాస్తవానికి తన సినిమాల్లో హీరోయిన్‌ని సాయి ధరమ్ తేజ్ చాలా స్పెషల్‌గా ట్రీట్ చేస్తాడు. ఇక్కడా ఆమెకు కలిగిన అసహనాన్ని తేజు తనదైన స్టయిల్లో చల్లార్చాడని చెప్పొచ్చు.