బండ్ల గణేష్ స్టేజ్ ఎక్కితే ఎలా ప్రసంగిస్తాడో అందరికీ తెలిసిందే. బండ్లన్న స్టేజ్ మీదకు కనిపిస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలు వచ్చేస్తాయి. బండ్ల గణేష్ మాటల ప్రవాహానికి, ప్రాసల ధాటికి ఎవ్వరూ తట్టుకోలేరు. ఆ ఉపమానాలు, అతిశయోక్తులు చెప్పడం మరెవ్వరి వల్లా కాదు. అలాంటి బండ్ల గణేష్‌ను, ఆయన స్పీచ్‌ను గల్లీ బాయ్స్ గలీజ్‌గా రోస్ట్ చేసి వదిలేశారు. ఆ మధ్య పటాస్ అనే ఓ షోలో ఓ గెస్ట్‌ను పిలవడం అతన్ని ఇమిటేట్ చేస్తూ స్కిట్లు వేసి రోస్ట్ చేసే పద్దతి అందరికీ తెలిసిందే.
అదే విధంగా ప్రతీ వారం బొమ్మ అదిరింది షోలో ఓ గెస్ట్‌ను పిలుస్తున్నారు. రాహుల్ రామకృష్ణ, శివ శంకర్ మాస్టర్, పోసాని కృష్ణమురళీ వంటి వారు ఎంట్రీ ఇచ్చారు. వారిపై సెటైరికల్ స్కిట్ వేస్తూ రోస్ట్ చేసి పడేశారు. వారిని దారుణంగా ఇమిటేట్ చేసేశారు. మరీ ముఖ్యంగా పోసాని, శివ శంకర్ మాస్టర్లు స్కిట్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. ఇప్పుడు తాజాగా బండ్ల గణేష్ వంతు వచ్చింది. గబ్బర్ సింగ్ నిర్మాతగా బండ్ల గణేష్ మెగా ఫ్యామిలిలో ఒకడయ్యాడు.
అలాంటి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి ఆ మధ్య స్టేజీ మీద ఇచ్చిన ప్రసంగాలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఓ సారి అలాగే మాట్లాడుతూ.. మా పిల్లిలు నీతి నిజాయితీ అంటే ఏంటి నాన్న అని అడిగారు.. అప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో చూయించాను అని చెప్పాడు. ఆ డైలాగ్ బాగానే ఫేమస్ అయింది. అదే డైలాగ్‌ను ఇప్పుడు సద్దాం దారుణంగా వాడేశాడు. బండ్ల గణేష్‌ను రోస్ట్ చేసేందుకు చేసిన ఈ స్కిట్ ఇమిటేషన్‌లా లేదు ఇరిటేషన్‌లా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.