వెళ్ళవయ్యా వెళ్ళు అనే డైలాగుతో జయం సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన నటి సదా జయం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈమెకు వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడిపారు.ఇలా తెలుగుతోపాటు తమిళంలో కూడా అగ్ర హీరోలందరు సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సదా గత కొంతకాలం నుంచి వెండితెరకు దూరమయ్యారు.ఇలా వెండితెరకు దూరమైన ఈమె బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేశారు.ఇకపోతే తాజాగా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సదా పలు ఇంటర్వ్యూలలో పాల్గొని తన కెరియర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తాను నటుడు మాధవన్ తో కలిసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించిన సమయంలో తన గురించి ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక మాధవన్ తోకలిసి ఈమె నటించిన ప్రియ సఖి సినిమాలో ఈమె ఎంతో రొమాంటిక్ సన్నివేశాలలో నటించారు. ఈ సినిమా సమయంలో సదా హీరో మాధవన్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడిన సదా ఇలా తన గురించి ఇలాంటి వార్తలు రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యానని తెలిపారు.
తన గురించి ఈ విధమైనటువంటి వార్తలు వచ్చినప్పుడు మొదట్లో చాలా బాధపడ్డానని అయితే సెలబ్రెటీ అన్న తర్వాత వారి గురించి ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణమే అని తెలుసుకున్నప్పటి నుంచి ఇలాంటి విషయాలు గురించి పెద్దగా పట్టించుకోనని ఈ సందర్భంగా ఈమె గతంలో తన గురించి నటుడు మాధవన్ గురించి వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఇక ఈమె ఈ ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి గురించి కూడా మాట్లాడుతూ సమయం వచ్చినప్పుడు పెళ్లి విషయం తానే ప్రకటిస్తానని వెల్లడించారు.